నమ్మి మిత్రపక్షంగా ఉంటే మోడీ మోసం చేశారు: చంద్రబాబు

చిత్తూరు: ప్రధాని తనపై చేసిన విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కౌంటరిచ్చారు. ప్రధాని తనకు పాఠాలు చెబుతాననడం, రాజకీయాలు నేర్పిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి నేనెప్పుడొచ్చా? మీరెప్పుడొచ్చారు? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 1970ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 2002లో రాజకీయాల్లోకి వచ్చిన మోడీ కాలం కలిసొచ్చి ప్రధాని పదవిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిని అహ్మదాబాద్ కంటే అద్భుతంగా నిర్మిస్తున్నామన్న కుళ్లుతోనే తనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనది యూటర్న్ […]

  • Vijay K
  • Publish Date - 7:55 am, Tue, 2 April 19
నమ్మి మిత్రపక్షంగా ఉంటే మోడీ మోసం చేశారు: చంద్రబాబు

చిత్తూరు: ప్రధాని తనపై చేసిన విమర్శలకు ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కౌంటరిచ్చారు. ప్రధాని తనకు పాఠాలు చెబుతాననడం, రాజకీయాలు నేర్పిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి నేనెప్పుడొచ్చా? మీరెప్పుడొచ్చారు? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 1970ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 2002లో రాజకీయాల్లోకి వచ్చిన మోడీ కాలం కలిసొచ్చి ప్రధాని పదవిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

అమరావతిని అహ్మదాబాద్ కంటే అద్భుతంగా నిర్మిస్తున్నామన్న కుళ్లుతోనే తనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అని అన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మర్చిపోయిన మీదే అసలైన యూటర్న్ అని ఎదురుదాడి చేశారు. రాష్ట్రానికి హోదా ఇస్తారన్న నమ్మకంతో మిత్రపక్షంగా ఉంటే దానిని తోసిపుచ్చి మోసం చేశారని అన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చంద్రబాబు అన్నారు.