బాబుకు మరో షాక్‌.. వైసీసీలో చేరిన చలమలశెట్టి

ఏపీలో ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

బాబుకు మరో షాక్‌.. వైసీసీలో చేరిన చలమలశెట్టి
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 31, 2020 | 6:04 PM

Chalamalashetty Sunil YSRCP: ఏపీలో ప్రతిపక్ష చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చలమలశెట్టి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కురసాల కన్నబాబు, చెల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత పలువురు పాల్గొన్నారు. అయితే ఈ నెల 10వ తేదీనే చలమలశెట్టి వైసీపీలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వలన చేరిక ఆలస్యమైంది.

కాగా 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి తోట నర్సింహం చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్‌, వైసీపీ ఎంపీ వంగా గీత చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత నుంచి టీడీపీకి దూరంగా ఉండగా, ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. కాగా 2022లో రాజ్యసభకు ఖాళీ అవుతున్న ఓ ఎంపీ స్థానంలో సునీల్‌కు అవకాశం కల్పించడానికి అధికార పార్టీతో ఇటీవల మంతనాలు జరిగినట్టు సమాచారం.

Read More:

నిజం తెలుసుకోకుండా మమ్మల్ని ట్రోల్‌ చేశారు: కృష్ణుడు

టాలెంటెడ్ డైరెక్టర్‌తో రానా.. అధికారిక ప్రకటన

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu