AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ తో ఏంచెప్పాలనో ఈ తాపత్రయం

తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి సంగారెడ్డి నియోజకరవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గన్న. ఎప్పుడూ తనదైన శైలిలో..

కేసీఆర్ తో ఏంచెప్పాలనో ఈ తాపత్రయం
Pardhasaradhi Peri
|

Updated on: Sep 01, 2020 | 3:59 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో విలక్షణ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి సంగారెడ్డి నియోజకరవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గన్న. ఎప్పుడూ తనదైన శైలిలో విచిత్రమైన వ్యాఖ్యలు చేసే ఈ కాంగ్రెస్ నేత తాజాగా మరో షాకింగ్ డెడ్ లైన్ పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ధర్నా చేస్తానంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ధర్నా చేస్తాం అని ప్రతిపక్ష పొలిటికల్ లీడర్లు వార్నింగ్స్ ఇవ్వడం పరిపాటి. అయితే జగ్గన్న రూటు సపరేటుకదా.. ప్రత్యర్థి పార్టీ అధినేత, సీఎం అయిన కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ధర్నాకు పిలుపు ఇచ్చారు జగ్గారెడ్డి. కేసీఆర్ తనకు కలిసేందుకు సమయం ఇచ్చేవరకూ ప్రగతిభవన్ ముందు ధర్నా చేస్తానంటున్నారు. జగ్గన్న చెబుతున్నట్టు నిజంగా ప్రజాసమస్యలను వివరించేందుకే కేసీఆర్ ను కలుస్తారా లేక తన పొలిటికల్ కెరీర్ గురించి చర్చించుకుంటారా అన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఫన్నీ డిస్కషన్ అయింది. టీఆర్ఎస్ కీలకనేత హరీష్ రావుపై విమర్శలు ఎక్కుపెట్టే జగ్గారెడ్డి పాలనలో క్రియాశీలకమైన కేటీఆర్ కు అయినా ప్రజా సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చుకదా అనే చర్చకూడా నడుస్తోంది.