సామాజిక బాధ్యత చాటుకున్న టీవీ9
టీవీ9 సామాజిక బాధ్యత చాటుకుంది. జేఈఈ(మెయిన్స్) రాయాల్సిన అభ్యర్థి..తను ఎగ్జామ్ రాయాల్సిన పరీక్షా కేంద్రానికి కాకుండా, మరో సెంటర్‌కు వెళ్లాడు.

టీవీ9 సామాజిక బాధ్యత చాటుకుంది. జేఈఈ(మెయిన్స్) రాయాల్సిన అభ్యర్థి..తను ఎగ్జామ్ రాయాల్సిన పరీక్షా కేంద్రానికి కాకుండా, మరో సెంటర్‌కు వెళ్లాడు. చివరి నిమిషాల్లో అతడికి విషయం తెలియడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అక్కడే ఉన్న టీవీ9 ప్రతినిధులు వెంటనే స్పందించారు. సదరు విద్యార్థిని సకాలంలో పరీక్ష రాయాల్సిన కేంద్రానికి తీసుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే..జేఈఈ(మెయిన్స్) ఎగ్జామ్ రాసేందుకు నిన్న రాత్రి ఆర్మూర్ నుంచి హైదారాబాద్ చేరుకున్నాడు ఓ విద్యార్థి. అతని వెంట తల్లిదండ్రులు కూడా తోడుగా వచ్చారు. ఈ రోజు ఉదయం వారు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చారు. అయితే సదరు విద్యార్థికి మౌలాలిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా, గందరగోళంతో నాచారం మల్లాపూర్‌లో అయాన్ డిజిటల్ జోన్ కి వెళ్లాడు. 9 నిమిషాల్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా అతడి సెంటర్ విషయంలో తడబడ్డాడని సిబ్బంది గుర్తించారు. దీంతో విద్యార్థి తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. పరిస్థితి గమనించిన టీవీ9 సిబ్బంది అతడిని ఎనిమిది నిమిషాల్లో మౌలాలి పరీక్ష సెంటర్‌కు చేర్చారు. చివరి క్షణంలో అభ్యర్థి పరీక్షకు హాజరయ్యాడు. దీంతో పేరెంట్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీవీ9 చేసిన సాయం జీవితంలో మరువలేనిది అని కొనియాడారు.
Also Read :