ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దాడులు
ఈఎస్ఐ స్కామ్‌లో మరోసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి, నాగలక్ష్మి...

ఈఎస్ఐ స్కామ్‌లో మరోసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు దేవికారాణి, నాగలక్ష్మి యత్నించారని అధికారులు పేర్కొన్నారు. రూ.4 కోట్ల నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. స్థలం కొనుగోలుకు ఓ బిల్డర్‌కు డబ్బు ఇచ్చినట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో బిల్డర్ దగ్గర నాలుగు కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బిల్డర్ వద్ద దేవికా రాణి నాలుగు కోట్ల నగదు దాచినట్లుగా అధికారులు ముందే గుర్తించారు. రెసిడెన్షియల్ స్థలం కోసం బిల్డర్ దగ్గర దేవికారాణి డబ్బులు డిపాజిట్ చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈఎస్ఐ డైరెక్టర్‌గా ఉండగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అవినీతి డబ్బుతో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు స్కెచ్ వేసినట్లుగా అధికారులు గుర్తించారు. కూకట్పల్లికి చెందిన ఓ ప్రైవేటు డవలపర్‌కు 4కోట్ల 47 లక్షలు ఇచ్చినట్లు గుర్తించినట్లుగా తెలిపారు. రియల్టర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రియాల్టర్ ఆస్తులను అటాచ్ చేస్తామనే అధికారులు హెచ్చరించారు. దీంతో ఏసీబీకి డబ్బు తిరిగి ఇచ్చేశారు.




