జనసైనికుల సేవాకార్యక్రమాలపై స్పందించిన జనసేనాని
జనసైనికులు నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. వారు చేస్తున్న సేవాకార్యక్రమాలను పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు...

జనసైనికులు నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. వారు చేస్తున్న సేవాకార్యక్రమాలను పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సేవా కార్యక్రమాల నిర్వహణ జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పదనమే అని అన్నారు.
జన్మదినోత్సవం సందర్భంగా కోవిడ్ ఆస్పత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్ కిట్లు ఇచ్చారని చెప్పారు. ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో జనసైనికుల సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి అని పేర్కొన్నారు. జనసైనికులు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు సేవామార్గాన్ని ఎంచుకోవడం ఎప్పటికీ మర్చిపోనన్నారు.
సేవా కార్యక్రమాల నిర్వహణ జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల గొప్పదనమే – JanaSena Chief Sri @PawanKalyan#JanaSeva pic.twitter.com/8TY942Qu2k
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2020