AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి ‘షించాన్’ పేరు.. కేసు నమోదు

షించాన్‌.. కార్టూన్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ పాత్ర సుపరిచితమే. జపాన్‌కి చెందిన ఈ కార్టూన్ కారెక్టర్ చేసే అల్లరిని

ఈసారి 'షించాన్' పేరు.. కేసు నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 6:17 PM

Share

Cartoonist Shinchan name: షించాన్‌.. కార్టూన్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ పాత్ర సుపరిచితమే. జపాన్‌కి చెందిన ఈ కార్టూన్ కారెక్టర్ చేసే అల్లరిని చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ కార్టూన్ కారెక్టర్‌ ఇప్పుడు కాలేజీ మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కాలేజీ ప్రకటించిన బీఎస్సీ(హానర్స్‌) మెరిట్ లిస్ట్‌లో షించాన్ పేరులో టాప్‌లో కనిపించింది. ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వెంటనే ఆ లిస్ట్‌ని తొలగించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది.

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు వేరే వేరే పేర్లతో దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌, సింగర్ నేహా కక్కర్ పేర్లు కూడా అక్కడి కాలేజీ మెరిట్ లిస్ట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో ఆయా కాలేజీ యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీన్ని సీరియస్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ విభాగం.. ఈ కేసులపై విచారణను వేగవంతం చేసింది. ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసులు చెబుతున్నారు.

Read More:

ఏపీలో రెండోసారి కరోనా సోకిన కేసులు నమోదు కాలేదు

షాకింగ్ న్యూస్‌‌.. శానిటైజర్లలో 50 శాతం కల్తీవట