కరోనా 4.0 : 100 ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు ప్లాన్
కరోనా మహమ్మారితో వచ్చిన ఇక్కట్లన్నీ నెమ్మది నెమ్మదిగా మాయమవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్‌లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం మరిన్ని రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది...
కరోనా మహమ్మారితో వచ్చిన ఇక్కట్లన్నీ నెమ్మది నెమ్మదిగా మాయమవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్‌లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం మరిన్ని రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తోంది.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో వంద రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ర్యూట్ మ్యాప్ రెడీ చేసింది. హోంశాఖకు రైల్వే శాఖ ప్రతిపాదనలను పంపించింది.
హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రైళ్లు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రెండు రోజుల్లో రైల్వేశాఖ ప్రకటన చేయనుంది. ఇప్పటికే అన్‌లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ఈనెల నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ గ్నీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలని చూస్తున్నారు. ప్రయాణికులు కూడా కరోనా ఆంక్షలు పాటించాలని సూచిస్తున్నారు.