స్పెషల్ స్టేటస్ కంటే.. స్పెషల్ ప్యాకేజీయే చాలని చంద్రబాబే అన్నారు..

కేంద్రంపై ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయన్నారు. స్పెషల్ స్టేటస్‌కు సమానమైన బెనిఫిట్స్ ఇస్తే సరిపోతుందని కేంద్రానికి చంద్రబాబే స్వయంగా లేఖ రాశారన్నారు. పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ కంటే.. స్పెషల్ ప్యాకేజీయే చాలని చంద్రబాబే చెప్పారన్నారు. కేంద్రంపై ఉన్న అపోహలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా […]

  • Publish Date - 3:29 pm, Tue, 26 March 19 Edited By:
స్పెషల్ స్టేటస్ కంటే.. స్పెషల్ ప్యాకేజీయే చాలని చంద్రబాబే అన్నారు..

కేంద్రంపై ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నాడో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయన్నారు. స్పెషల్ స్టేటస్‌కు సమానమైన బెనిఫిట్స్ ఇస్తే సరిపోతుందని కేంద్రానికి చంద్రబాబే స్వయంగా లేఖ రాశారన్నారు. పార్లమెంట్ సాక్షిగా స్పెషల్ స్టేటస్ కంటే.. స్పెషల్ ప్యాకేజీయే చాలని చంద్రబాబే చెప్పారన్నారు. కేంద్రంపై ఉన్న అపోహలు నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏప్రిల్ 11న ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. అవినీతి పాలన అందిస్తోన్న చంద్రబాబును ప్రజలు తప్పక తిప్పికొడతారని స్పష్టం చేశారు పీయూష్ గోయల్.