AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.. ఆయన్ను వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే రెండు నెలల క్రితం హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్న ఓ వ్యాపారిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడి ఫిర్యాదుతో కౌషిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సుబేదార్‌ పోలసులు.. తాజాగా ఆయన్ను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Kowshik Reddy
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 11:44 AM

Share

.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితరచూ ఎదో ఒక వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇటీవల హుజురాబాద్‌కు చెందిన ఓ గ్రానైట్‌ వ్యారిని బెదిరించి రూ.50లక్షలు డిమాండ్ చేశాడని బాధితులు సుబేదార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. అతని ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డిని అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే, కట్టా ఉమాదేవి అనే మహిళ ఫిర్యాదు మేరకు కౌషిక్ రెడ్డిపై పోలీసులు ఈ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఉమాదేవి భర్త కట్టా మనోజ్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం వంగపల్లి వద్ద గ్రానైట్ క్వారీ నిర్వహిస్తుండగా.. కౌశిక్ రెడ్డిఅతన్ని బెదిరించి గతంలో 25 లక్షల రూపాయలు తీసుకున్నారని.. మళ్ళీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరిస్తున్నట్టు ఆమె ఆరోపించింది. తన భర్తతో పాటు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో రమాదేవి పేర్కొంది.

ఇదిలా ఉండగా వాళ్లు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిహైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. అయితే దానిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈనెల 16వ తేదీన ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో కౌశిక్ రెడ్డిమరోసారి హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే ప్రస్తుతం సుబేదార్‌ పోలీసుల అదుపులో ఉన్న కౌషిక్‌ రెడ్డిని కోర్టులో హాజరు పరిచిన తర్వాత జైలుకు పంపనున్నారు పోలీసులు. కాగా కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సుబేదారి పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..