Anandaiah New Political Party: కొత్త పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీ.. అఖిల భారత యాదవ సమాఖ్య నాయకులతో సమీక్షలు..
Anandaiah New Political Party: ఆనందయ్య మరో సంచలనానికి సిద్ధమయ్యారు. బీసీల కోసం పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రంగంలోకి..
కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న నెల్లూరు ఆనందయ్య మరో సంచలనానికి సిద్ధమయ్యారు. బీసీల కోసం పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. రాజకీయ పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీగా మారిపోయాడు. నెల్లూరు జిల్లాల్లో అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు ఏర్పాటు చేసేదుకు సిద్ధమవుతున్నారు. నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో యాదవ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అందరితో చర్చించిన తర్వత బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే పార్టీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో ఓ టీమ్ ఇదే పనిలో ఉన్నట్లుగా సమాచారం.
ఆనందయ్య పెట్టపెట్టబోయే పార్టీ కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఆనందయ్య. అయితే తాను మాత్రం జాతీయ అధ్యక్షడిగా కాకుండా కేవలం ఏపీలోని పార్టీకి సారథ్యం వహిస్తానంటున్నారు ఆనందయ్య.
తన రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై వివరించారు. తన లక్ష్యాలను చెప్పారు. దేశంలో బీసీల పరిస్థితి, పార్టీ ఆవశ్యకతపై తన వద్ద ఓ బ్లూ ప్రింట్ ఉందంటున్నారు ఆనందయ్య.
ఇవి కూడా చదవండి: IPL srh vs csk Match Prediction: చెన్నైతో సై అంటే సై.. విజయోత్సాహంతో దూకుడుమీదున్న హైదరాబాద్