బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అసలేం జరుగుతోంది..?

బీజేపీ ఎంపీని కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. అసలేం జరుగుతోంది..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీలో విభేదాలు తెచ్చినట్లు కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు దక్కని ఆశావహులు తమ నిరసన గళాన్ని ఒక్కొక్కరిగా వినిపిస్తున్నారు. విస్తరణ కంటే ముందుగానే ఇద్దరి మంత్రి పదవులు పొతున్నాయంటూ వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ కోవలో ఆ మంత్రి పార్టీకి ఓనర్ నేనే అంటూ వ్యాఖ్యలు కూడా చేసి.. పెద్ద చర్చకే దారితీశారు. ఆ తర్వాత ఆ సమస్య సద్దుమణిగింది. మంత్రి పదవి కూడా అలానే ఉంది. అయితేనేం.. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 12, 2019 | 5:23 PM

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. అధికార పార్టీలో విభేదాలు తెచ్చినట్లు కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు దక్కని ఆశావహులు తమ నిరసన గళాన్ని ఒక్కొక్కరిగా వినిపిస్తున్నారు. విస్తరణ కంటే ముందుగానే ఇద్దరి మంత్రి పదవులు పొతున్నాయంటూ వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ కోవలో ఆ మంత్రి పార్టీకి ఓనర్ నేనే అంటూ వ్యాఖ్యలు కూడా చేసి.. పెద్ద చర్చకే దారితీశారు. ఆ తర్వాత ఆ సమస్య సద్దుమణిగింది. మంత్రి పదవి కూడా అలానే ఉంది. అయితేనేం.. ఆ తర్వాత మరో ఇద్దరు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న వారు సీఎం తీరుపై మండిపడ్డారు. మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అయితే ఎకంగా తనని సీఎం కేసీఆర్ మోసం చేశారంటూ ఆరోపించారు. ఆ తర్వాత మా అధినేత కేసీఆర్ అంటూ తెలిపారు.

మంత్రి పదవి దక్కని కొందరు టీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం… వారిని టీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించడం కొద్దిరోజులుగా జరుగుతోంది. అయితే వీరిలో కొంత మంది అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. పార్టీ మారుతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. రాబోయే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సం రోజులు చాలా మంది బీజేపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ వట్టి మాటాలే.. అంటూ బీజేపీ అధికార ప్రతినిధి కూడా తెలిపారు. అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అరవింద్‌ను కలవడంతో ఆయన పార్టీ మారతారేమో అన్న వార్తలు జోరందుకున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావహులను పార్టీ బుజ్జగిస్తూ వస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా బోధన్‌కి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. నిజామాబాద్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్యనేత కవితకు సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న షకీల్.. ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కలవడం టీఆర్ఎస్ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. అసలు పార్టీలో ఏం జరుగుతుందో అన్నదానిపై సతమతమవుతున్నారు.

అయితే షకీల్‌కు మంత్రి పదవి దక్కకపోవడంతో ఒకింత అసంతృప్తితో ఉన్న విషయం పార్టీకి తెలిసిందే. అయితే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామన్న విషయంలోనూ పార్టీ నాయకత్వం హామీ ఇవ్వకపోవడంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కారణాన్ని చూపుతూ.. పార్టీపై ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఎంపీ అరవింద్‌ను కలిశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రాష్ట్రంలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేను నేనేనంటూ షకీల్ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ కనుసన్నల్లో తమ పార్టీ నడుస్తుందని.. 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు.. కానీ తనకి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. మూడు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచానన్నారు. ఎంపీ అరవింద్‌తో రాజకీయ చర్చలు జరిపానన్న షకీల్.. సోమవారం రోజు తన భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu