పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ కాంపెయినర్స్ , 40 మందితో జాబితా రిలీజ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎలెక్షన్స్ కోసం తమ పార్టీ స్టార్ కాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేబినెట్ మంత్రులు స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో బాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్,

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్టార్ కాంపెయినర్స్ , 40 మందితో జాబితా రిలీజ్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2021 | 3:22 PM

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎలెక్షన్స్ కోసం తమ పార్టీ స్టార్ కాంపెయినర్స్ జాబితాను విడుదల చేసింది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేబినెట్ మంత్రులు స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో బాటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, రాష్ట్ర బీజేపీ ఇన్-ఛార్జ్ కైలాష్ విజయ్ వర్గీయ వంటి మహామహులు ఉన్నారు. అలాగే మొదట చిత్రాలు, టీవీ సీరియల్స్ లో నటించి ఆ తరువాత రాజకీయ నాయకులైన మిథున్ చక్రవర్తి, లాకెట్ ఛటర్జీ, రూపా గంగూలీ, బాబుల్  సుప్రియో, మనోజ్ తివారీ, స్రవంతి ఛటర్జీ, పాయెల్ సర్కార్, హీరేన్ ఛటర్జీవంటివారు కూడా  పార్టీ స్టార్ కాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు.

ముఖ్యంగా బెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేయనున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి తరఫున మిథున్ చక్రవర్తి ప్రచారం చేయనున్నాడు. ఈ నెల 12న  సువెందు అధికారి నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయన వెంట మిథున్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర ముఖ్య నేతలు ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పెద్ద ఎత్తున ఆర్భాటంగా అధికారి నామినేషన్  వేయనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తాను మమతాబెనర్జీ పై 50 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధిస్తానని అధికారి ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే నిన్న ఈ నియోజకవర్గాన్ని సందర్శించి తమ పార్టీ తరఫున జరిగిన ర్యాలీలో పాల్గొన్న మమత.. ఈ స్థానంలో ఎవరిది  గెలుపో ఓటర్లే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తను ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నానో కూడా ఆమె వివరించారు. ప్రజలకు తమ ప్రభుత్వం చేస్తున్న సేవలను ఆమె ప్రస్తావించారు.

కాగా….. బెంగాల్ ఎన్నికలకు బీజేపీ స్టార్ కాంపెయినర్ల జాబితా ఇలా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

PUBG Mobile: పబ్జి ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త హంగులతో pubg mobile 1.3 లాంచ్.. అవెంటో తెలుసా..

Uttarakhand Updates: 21ఏళ్ళలో 10మంది ముఖ్యమంత్రులు.. పూర్తి టెర్మ్ వున్న సీఎం ఒక్కరే.. ఇదీ ఉత్తరాఖండ్ హిస్టరీ

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే