AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Politics: అప్పటి నుంచి ఇప్పటివరకూ..ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన అంతంత మాత్రమే..మూడేళ్ళలో ఎక్కడెక్కడ గెలిచిందంటే..

భారతీయ జనతా పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ, తరువాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ హవా కొనసాగించడంలో విఫలం అవుతూ వస్తోంది.

National Politics: అప్పటి నుంచి ఇప్పటివరకూ..ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన అంతంత మాత్రమే..మూడేళ్ళలో ఎక్కడెక్కడ గెలిచిందంటే..
BJP
KVD Varma
|

Updated on: May 03, 2021 | 7:04 AM

Share

National Politics: భారతీయ జనతా పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ, తరువాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ హవా కొనసాగించడంలో విఫలం అవుతూ వస్తోంది. ప్రజలు కేంద్రంలో బీజేపీ రాష్టంలో ఇంకోటీ అనే ధోరణిలో ఉన్నారా? లేక సార్వత్రిక ఎన్నికల తరువాత బీజేపీ పై ప్రజల్లో విశ్వాసం సంనగిల్లిందా అనే అంశాన్ని పక్కన పెడితే, ఎన్నికల్లో బీజేపీ ఈ ప్రదర్శన మాత్రం నిరాశాజనకం అనే చెప్పాలి. 2019 లో ఎన్నికలు జరిగిన తరువాత ఇప్పటివరకూ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ 14 ఎన్నికల్లో కేవలం 5 చోట్ల మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇంకో విషయం ఏమిటంటే.. తాను అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను కోల్పోయింది కూడా. అయితే, కొత్తగా ఒక రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. ప్రస్తుతం బీజేపీ దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్న చోట మూడింటిలో మాత్రమే బీజేపీ అభ్యర్ధులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు.

2019 ఎన్నికల దగ్గర నుంచి దేశంలో జరిగిన ఎన్నికలు.. బీజేపీ ప్రదర్శన..

  • 2019లో లోక్‌సభ ఎన్నికలతోపాటు సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఆ మూడు చోట్లా ప్రాంతీయ పార్టీలు విజయం సాధించాయి.
  • అదే సంవత్సరం జరిగిన అరుణాల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ఘన విజయం సాధించింది. హరియాణా ఎన్నికల్లో ఏకైక పెద్దపార్టీగా అవతరించి ఎన్నికల అనంతరం జననాయక్‌ జనతాపార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఝార్ఖండ్‌ ఎన్నికల్లో పరాభావం చవిచూసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మిత్రపక్షమైన శివసేన దూరం కావడంతో అధికారానికి దూరమైంది.
  • 2021 ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ల్లో అధికారం దక్కలేదు. అస్సాంలో మాత్రం మిత్రపక్షాలతో కలిసి వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకొంది. పుదుచ్చేరిలో ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

మొత్తంమ్మీద చూస్తే, ఈ మూడేళ్ళలోనూ జరిగిన 14 రాష్ట్రాల ఎన్నికల్లో.. మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో తన అధికారాన్ని కోల్పోయింది బీజేపీ. అలాగే, అరుణాచల్ ప్రదేశ్, హరియానా, బిహార్, అస్సాం, పుదుచ్చేరిలలో మిత్ర పక్షాలతో అధికారం చేజిక్కించుకుంది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉండిపోయింది.

Also Read: Oxygen: ఆక్సిజన్ కోసం న్యూజిలాండ్ హై కమిషన్ ట్వీట్.. వివాదాస్పదం..సిలెండర్ సరఫరా చేసిన కాంగ్రెస్ వర్గాలు

ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉన్నాయి..! వర్షాలు పడుతాయా లేదా కరువా..? తెలుసుకోండి..