అవన్నీ అవాస్తవాలు.. కోడెల కాల్‌డేటాపై ఏసీపీ క్లారిటీ

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తును జరుపుతున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తెలిపారు. ఈ కేసులో అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని.. ఇప్పటి వరకు 12 మందిని ప్రశ్నించామని పేర్కొన్నారు. త్వరలో కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా విచారిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే కోడెల కుటుంబసభ్యుల వాంగ్మూలం కూడా తీసుకున్నామని.. కోడెల పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేఎస్ రావు స్పష్టం చేశారు. ఇక కోడెల మొబైల్‌ […]

అవన్నీ అవాస్తవాలు.. కోడెల కాల్‌డేటాపై ఏసీపీ క్లారిటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 19, 2019 | 8:07 AM

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై దర్యాప్తును జరుపుతున్నామని బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు తెలిపారు. ఈ కేసులో అనుమానం ఉన్న వారందరినీ విచారిస్తున్నామని.. ఇప్పటి వరకు 12 మందిని ప్రశ్నించామని పేర్కొన్నారు. త్వరలో కోడెల కుమారుడు శివరామ్‌ను కూడా విచారిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే కోడెల కుటుంబసభ్యుల వాంగ్మూలం కూడా తీసుకున్నామని.. కోడెల పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేఎస్ రావు స్పష్టం చేశారు.

ఇక కోడెల మొబైల్‌ ఫోన్‌ కాల్‌ డేటాపై కూడా ఆరాతీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సీడీఆర్‌ఏ కోడెల కాల్‌ లిస్ట్‌ రిపోర్టు పరిశీలిస్తుందని తెలిపారు. మరోవైపు కోడెల కాల్‌డేటాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కోడెల శివప్రసాదరావు మృతి కేసులో కీలకం కానున్న ఆయన మొబైల్‌ ఇంకా దొరకలేదని వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.