ఏపీ, తెలంగాణ డేటా పాలిటిక్స్..

డేటా వార్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై టీడీపీ భగ్గుమంటోంది. ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శులతో జరిగిన అర్థరాత్రి భేటీలో తాజా పరిణామాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైఖరిపై మండిపడుతున్నారు. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే.. అన్నట్లు చంద్రబాబు వైఖరి ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇటు హైదరాబాద్‌లో నమోదైన కేసును సిట్‌కు అప్పగించింది తెలంగాణా సర్కార్. సిట్ […]

ఏపీ, తెలంగాణ డేటా పాలిటిక్స్..
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:07 PM

డేటా వార్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై టీడీపీ భగ్గుమంటోంది. ఏపీ డీజీపీ, హోం శాఖ కార్యదర్శులతో జరిగిన అర్థరాత్రి భేటీలో తాజా పరిణామాలపై చర్చించారు సీఎం చంద్రబాబు. వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైఖరిపై మండిపడుతున్నారు. ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే.. అన్నట్లు చంద్రబాబు వైఖరి ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇటు హైదరాబాద్‌లో నమోదైన కేసును సిట్‌కు అప్పగించింది తెలంగాణా సర్కార్. సిట్ నేటి నుంచి దర్యాప్తును ప్రారంభిస్తోంది.

స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలోని సిట్ బృందం ఇవాళ్టి నుంచి దర్యాప్తును ప్రారంభించనుంది. అయితే.. దానికంటే ముందు ఇవాళ తెలంగాణా డీజీపీ కేసు పూర్వాలపరాలను సమీక్షించనున్నట్లు సమాచారం. రెండు కమిషనరేట్ల పరిధిలో వేర్వేరు కేసులు నమోదైన నేపథ్యంలో వాటిని ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. డేటా చోరి వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్‌ఛార్జ్‌గా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించగా ఆయన సారథ్యంలోని బృందంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి, డీఎస్పీ రవీంద్రకుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను నియమించారు. జంట కమిషనరరేట్ల పరిధిలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు మొత్తం సిట్‌కు బదిలీ చేస్తున్నారు. డీజీపీ కార్యాలయంలో సిట్‌కు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు.

సేవా మిత్రా యాప్ ద్వారానే ఓట్ల తొలగింపు జరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందని అన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. ఎలా జరుగుతుందో డెమోతో వివరించారు. ఓట్ల తొలగింపుపై దశరథరామిరెడ్డి ఇచ్చి కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు సీపీ. ఏపీలో స్వస్థలం ఉండి.. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నవారికి ఫోన్ కాల్స్ వచ్చాయని.. వారిలో టీడీపీని వ్యతిరేకించిన వారి ఓట్లు తొలగించబడినట్లు ఫిర్యాదులందాయన్నారు. దీంతో ఐటీ గ్రిడ్ సంస్థపై ఐపీసీ 420, 467, 468, 471, 120బీ కింద కేసులు నమోదు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

మరోవైపు టీడీపీ నేతలు తెలంగాణా పోలీసులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థపై దాడి చేసి తెలంగాణ పోలీసులు డేటాను ఎత్తుకెళ్లారని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు అందచేసిన ఫిర్యాదులో టీడీపీ నేతలు పేర్కొన్నారు. రెండు దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీ కష్టపడి నిల్వ చేసుకున్న సమాచారాన్నంతా తెలంగాణ పోలీసులు చోరి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా.. డేటా చౌర్యం కేసును అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. తాజా పరిస్థితులను ఏపీ సీఎం చంద్రబాబు హోంశాఖ కార్యదర్శి అనురాధ, డీజీపీ ఠాకూర్‌తో సమీక్షించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu