Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala : ‘పవన్‌ కళ్యాణ్ కైతే నచ్చచెప్పొచ్చు.. ఇన్నేళ్ల పాలనానుభవం ఉన్న బాబు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ : సజ్జల

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టుగా.. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు, అసత్యాలు వంటబట్టించుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు...

Sajjala : 'పవన్‌ కళ్యాణ్ కైతే  నచ్చచెప్పొచ్చు.. ఇన్నేళ్ల పాలనానుభవం ఉన్న బాబు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావడం లేదు' : సజ్జల
Sajjala Ramakrishna Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 17, 2021 | 8:32 PM

Sajjala Ramakrishna reddy : పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అన్నట్టుగా.. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు, అసత్యాలు వంటబట్టించుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతుల‌పై ప్ర‌తిప‌క్షాల‌ది క‌ప‌ట ప్రేమ అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విమ‌ర్శించారు. రైతులపై చంద్రబాబు కపట ప్రేమ కురిపిస్తూ, అబద్ధాలు, అసత్యాలతో లేఖలు రాస్తున్నారని మండిప‌డ్డారు. చంద్రబాబు హయాంలో చూసిన చీకటి రోజులను రైతులు ఇంకా మరచిపోలేదని ఆయన చెప్పుకొచ్చారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన.. రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపిందని, రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు హయాంలో రబీలో జరిగిన ధాన్యం సేకరణ- రైతులకు చెల్లించిన మొత్తాలను అధికారుల నుంచి తెప్పించి చూస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని సజ్జల అన్నారు. “రాష్ట్రంలోని రైతాంగం పట్ల ప్రతిపక్ష నాయకులు వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్నారు. తమ హయాంలో రైతులకు స్వర్గంలా ఉండేదని.. ఇప్పుడు నరకంలా ఉందని చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. దెయ్యం మాదిరిగా చంద్రబాబుది వంకర బుద్ధి. మంచిని తప్పు అని చెప్పడం… తప్పును మంచి అని చెప్పడం ఆయనకు అలవాటు.” అని సజ్జల విమర్శించారు.

పులి లేకున్నా… ఉన్నట్లు భ్రమ కలిగించేలా చంద్రబాబు చేష్టలు ఉన్నాయని సజ్జల మండిపడ్డారు. అబద్ధాలు మినహా ఇంకేమీ లేకుండా బక్కెట్ల కొద్ది బురద తెచ్చి.. ప్రభుత్వంపై చల్లేస్తూ దాన్ని మీరే వదిలించుకోండి అన్న చందంగా బాబునాయుడు వ్యవహరిస్తున్నారని సజ్జల ఆరోపించారు. “ఆయన తన సహజ స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి పాలనా అనుభవం లేని పవన్‌ కల్యాణ్‌ లాంటి వారు, ఓ వర్గం మీడియాలో వచ్చిన కథనాలు చూసి రెచ్చిపోయి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. అసలు విషయం ఇది అని నచ్చచెప్పవచ్చు. మరి ఇన్నేళ్ల పాలనా అనుభవం ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు”  అని సజ్జల విమర్శించారు.

Read also : KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ