Eatala Rajender: వేధిస్తే సహించేది లేదు.. కేసీఆర్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ వార్నింగ్..
Eatala Rajender on KCR Govt: తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులను వేధిస్తే సహించేది లేదని
Eatala Rajender on KCR Govt: తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులను వేధిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కేవలం ప్రేమకు మాత్రమే లొంగుతారంటూ ఈటల పేర్కొన్నారు. రాజీనామా చేసిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గనికి వచ్చిన ఈటల రాజేందర్‌కు అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ .. తనను, తన అనుచరులను వేధిస్తే ప్రభుతాన్ని ఘోరీ కడతామని హెచ్చరించారు. నైతిక విలువలు పాటించి.. ప్రజాస్వామ్యన్ని గౌరవించి టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వనికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
తనకు మద్దతు ఇస్తున్న వారిని ఇంటిలిజెన్స్ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వాళ్లను వేధిస్తే సహించేది లేదంటూ ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చిలుక పలుకులు పలుకుతున్న మంత్రులకు ఆత్మగౌరవం ఉందా అంటూ ఈటల ప్రశ్నించారు. 2024లో జరిగే ఎన్నికలకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఒక రిహార్సల్ లాంటిదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి నియోజవర్గంలోని ఇంటింటికి వెళ్లి అందరిని కలుస్తానని ఈటల రాజేందర్ తెలిపారు.
Also Read: