Premsagar Rao: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్. అదిష్టానానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు అల్టీమేటం..!
హుజూరాబాద్ ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.
Prem Sagar Rao’s Ultimatum to Congress: హుజూరాబాద్ ఓటమితో నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన అనుచరులతో సమావేశమవుతున్నారు. ఈ మీటింగ్ తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చిన నేతలతోనే కాంగ్రెస్ వీడుతున్నట్లు ఆయన చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో మంచిర్యాలలో తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కీలక సమావేశం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పార్టీనే నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరుగుతోందని ప్రేంసాగర్ రావు మండిపడ్డారు. పార్టీకోసం కష్టపడి పని చేసే కార్యకర్తలు, నాయకులను వదిలేసి కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రవెళ్లి సభకు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులను విస్మరించడంపై దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ పార్టీలో మార్పు చేర్పులు చేయాల్సిందేనన్న ప్రేంసాగర్.. జిల్లా కార్యకర్తల నిర్ణయంతో ముందుకు వెళుతామన్నారు. ఈనెల 10 వరకు అదిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తామని. ఎలాంటి ప్రక్షాళన లేకుంటే.. ఆ తరువాత మా దారి మేం చూసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. అవసరం అయితే కొత్త పార్టీ పెట్టేందుకు సైతం సిద్దంగా ఉన్నామన్నారు.
Read Also… Crime News: పాకిస్థాన్‌లో మరో నీచ భాగోతం బట్టబయలు.. అధికారుల దర్యాప్తుతో వెలుగులోకి సంచలనాలు!