YS Jagan: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. నాడూ, నేడూ.. నా ప్రయాణం ప్రజల కోసమే: సీఎం వైఎస్ జగన్

CM YS Jagan on Praja Sankalpa Yatra: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..

YS Jagan: ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు.. నాడూ, నేడూ.. నా ప్రయాణం ప్రజల కోసమే: సీఎం వైఎస్ జగన్
Ys Jagan
Follow us

|

Updated on: Nov 06, 2021 | 12:01 PM

CM YS Jagan on Praja Sankalpa Yatra: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి.. 341 రోజుల పాటు కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను తెలుసుకొని.. 2019లో అధికారాన్ని చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు. నాడు నేడూ నా యాత్ర, నా ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే. మీ అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని’’ సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిని పురస్కరించుకొని ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు పలు కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు.

ప్రజా సంకల్ప యాత్ర.. 2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా జగన్‌ మహా పాదయాత్ర కొనసాగింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్ర అనంతరం వైఎస్ జగన్ పార్టీ వైసీపీ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.

Also Read:

Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. రేపటినుంచే పాపికొండలకు బోటు సర్వీసులు..

Watch Video: తిరుమల బైపాస్‌లో జనంపైకి దూసుకెళ్లిన కారు.. కొనుగోలు చేసి తీసుకొస్తుండగా.. వీడియో