AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. రేపటినుంచే పాపికొండలకు బోటు సర్వీసులు..

Papikondalu Boat Services: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటినుంచి (నవంబర్ 7వ తేదీ) పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా

Papikondalu: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. రేపటినుంచే పాపికొండలకు బోటు సర్వీసులు..
Papikondalu Tourism
Shaik Madar Saheb
|

Updated on: Nov 06, 2021 | 7:16 AM

Share

Papikondalu Boat Services: పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటినుంచి (నవంబర్ 7వ తేదీ) పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాపికొండలకు బోటింగ్ కార్యకలాపాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తూర్పుగోదావరి కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బోట్ సర్వీసుల ప్రారంభంపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు. తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. రేపటినుంచి బోటు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు గండి పోచమ్మ ఆలయం బోట్ పోయింట్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే.. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్‌ ధరను రూ.1,250 గా ప్రభుత్వం అంతకుమందు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

కాగా.. కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత దాదాపు రెండేళ్ల అనంతరం ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. పాపికొండల సర్వీసులతోపాటు భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు.

Also Read:

Bandi Sanjay: అసలు దోషి టీఆర్ఎస్ ప్రభుత్వమే.. పెట్రోల్‌పై వ్యాట్ ఎందుకు తగ్గించడం లేదు: బండి సంజయ్

Sadar Mela: హైదరాబాద్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. ఖైరతాబాద్ చౌరస్తాలో పరుగులు పెట్టిన దున్నపోతు