BJP Next Target: తెలంగాణ, ఏపీపై బీజేపీ ఫోకస్.. కమల దళం ఆపరేషన్‌ షురూ..

ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో సత్తాచాటింది బీజేపీ. పంజాబ్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధించింది. మరి బీజేపీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏంటి?

BJP Next Target: తెలంగాణ, ఏపీపై బీజేపీ ఫోకస్.. కమల దళం ఆపరేషన్‌ షురూ..
Pm Modi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 10, 2022 | 10:18 PM

అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్‌ను మరోసారి నిలబెట్టుకుంది బీజేపీ(BJP). ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. స్పష్టమైన మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు సీఎం యోగి. ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాం మరోసారి ఫలించింది. మరి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుగురాష్ట్రాలపై ప్రభావం చూపుతాయా? మోదీ, అమిత్‌షా ఆపరేషన్ తెలంగాణ మొదలెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై యూపీ ఫలితాలు ప్రభావం చూపడం ఖాయమంటున్నారు.

ఇప్పటికే తెలంగాణలో దూకుడుమీద ఉన్న బీజేపీ..ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనంటూ ఇప్పటికే ఊదరగొడుతున్నారు తెలంగాణ నేతలు. అందుకు అనుగుణంగా పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణపై ఫోకస్‌ పెంచినట్లు తెలుస్తోంది.

నార్త్‌ ఇండియాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ సౌత్‌ ఇండియాలో మాత్రం పాగా వేయలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ, ఏపీపై ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం. చూడాలి మరి తెలుగు బీజేపీ రాష్ట్రాల్లో ఏమేరకు రాణిస్తుందో..

ఇవి కూడా చదవండి: CM Yogi: ఏయ్‌ బిడ్డా.. ఇది యూపీ గడ్డ.. యోగి అడ్డా.. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన బీజేపీ..

G Kishan Reddy: బీజేపీ గెలుపు వెనుక ఆ తెలుగోడు.. గోవాలో చక్రం తిప్పిన కిషన్ రెడ్డి.. 

ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
ఆ హీరోయిన్.. ఈ హాట్ బ్యూటీ ఇద్దరూ ఒకటేనా..!!
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..