ఏపీ పంచాయతీ నామినేషన్లలో యాక్షన్స్ సీన్స్, ప్రకాశం జిల్లా పెద్దగంజాంలో టీడీపీ తరపు సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో యాక్షన్స్ సీన్స్ మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్దగంజాంలో టీడీపీ మద్దతుదారుడు,..

  • Venkata Narayana
  • Publish Date - 6:43 pm, Sat, 30 January 21
ఏపీ పంచాయతీ నామినేషన్లలో యాక్షన్స్ సీన్స్,  ప్రకాశం జిల్లా పెద్దగంజాంలో టీడీపీ తరపు సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో యాక్షన్స్ సీన్స్ మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్దగంజాంలో టీడీపీ మద్దతుదారుడు, సర్పంచ్ అభ్యర్థి ఎల్లావుల తిరుపతిరావు కిడ్నాప్ కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు తిరుపతిరావు కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుపతిరావు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఉదయం గుడికి వెళ్ళి కారులో తిరిగి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి ఎత్తుకెళ్లారని స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలు చినగంజాం ఎస్‌ఐకి ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి తిరుపతిరావు కిడ్నాప్‌కి గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఓవైపు పోలీసులు అతని కోసం గాలిస్తూనే గ్రామంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పెదగంజాం చేరుకున్నారు. తిరుపతి రావు కిడ్నాప్ వ్యవహారంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తో ఫోన్ లో మాట్లాడారు. తిరుపతిరావు కిడ్నాప్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.