చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, కార్యదర్శి వెంకటరాజుకు నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ స్పందించింది. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ ఏపీ కార్యదర్శి వెంకటరాజుకు నోటీసులు ఇచ్చింది...

టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ స్పందించింది. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ ఏపీ కార్యదర్శి వెంకటరాజుకు నోటీసులు ఇచ్చింది. మేనిఫెస్టోపై రెండ్రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తీసుకుంటామంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. కాగా, రాజకీయ పార్టీలతో సంబంధంలేని పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడమేమిటని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మేనిఫెస్టో పై ఎందుకు స్పందించడంలేదని కూడా ఆపార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు.