AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్ఈసీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. విధులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడి

అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని కలిశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో   ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిలో ఉన్న అనుమానాలు..

ఎస్ఈసీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. విధులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నామని వెల్లడి
Sanjay Kasula
|

Updated on: Jan 30, 2021 | 8:47 PM

Share

AP Union Leaders : అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని కలిశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో   ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిలో ఉన్న అనుమానాలు, భయాందోళనలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అమరావతి జేఏసీ నేత బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నిమ్మగడ్డను కలిశామని బొప్పరాజు చెప్పారు.

27న కార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాలను వినతిపత్రంగా అందించామన్నారు. వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోరామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ చెప్పామని తెలిపారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెబుతూనే … ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి కల్పించాల్సిన భద్రతపై చర్చించినట్లు అమరావతి ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరితగతిన వ్యాక్సిన్ ఇచ్చేలా చూడాలని కోరామని పేర్కొన్నారు. కుదిరితే 2, 3 విడతల షెడ్యూల్‌ను కూడా వెనక్కి జరపాలని కోరామన్నారు.

అలాగే అటు ఎస్‌ఈసీ నోటీసులు, ఇటు రాజకీయ పార్టీల తీవ్ర ఒత్తిడి ఉద్యోగులపై పడటం కారణంగా ఏవైనా పొరపాట్లు జరిగిన చర్యలు తీసుకోవద్దని కోరారు. అలాగే 50ఏళ్లు పైబడిన వాళ్లతో పాటు గుండెపోటు వంటి సమస్యలున్న వాళ్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరడం జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి :

Israel Embassy Blast : ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో పురోగతి.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు..

Myntra to Change Logo : మహిళ ఇచ్చిన షాక్‌తో లోగోనే మార్చేసుకున్న ఈ-కామర్స్ దిగ్గజం