- Telugu News Photo Gallery You will get these amazing health benefit from eating fish in winter season
Fish in Winter: చలికాలంలో చేపలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే తీసుకోకుండా ఆగలేరంతే..!
చేపలు రుచికి, ఆరోగ్యానికి ఎంతో మేలైనవిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసినప్రోటీన్లు, విటమిన్లు, మాంసకృతులు, మినరల్స్ వంటి పలు పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తినాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Jan 16, 2023 | 12:28 PM

చేపలు రుచికి, ఆరోగ్యానికి ఎంతో మేలైనవిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసినప్రోటీన్లు, విటమిన్లు, మాంసకృతులు, మినరల్స్ వంటి పలు పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తినాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనలు ప్రకారం చలికాలంలో చేపలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేపలు ఎంతో మేలుగా ఉంటాయని నిపుణులు చెబుుతున్నారు. వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులను నివారించడంతో పాటు శరీరానికి కావలసిన అనేక పోషకాలు కూడా లభిస్తాయని వారు సూచిస్తున్నారు.

చేపలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇక చలికాలంలో ట్యూనా, సాల్మన్, మాకేరెల్ తినడం ఆరోగ్యానికి మంచిదిగా ఉంటుంది.

చలికాలంలో వచ్చే చర్మ సమస్యలు, కేశ సమస్యల నుంచి ఉపశమనం కోసం చేపలను తినడం ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

చేపలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపడుతుంది. చేపలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు అజీర్తి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాక శరీరంలో మంటను తగ్గించడంలో కూడా చేపలోని పోషకాలు సహాయపడతాయి.

చలికాలంలో దగ్గు, జలుబు సంబంధిత సమస్యలు సర్వసాధారణం.ఈ సమస్యలను అధిగమించేందుకు చేపలను తీసుకోవాలని, తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.




