- Telugu News Photo Gallery World photos Russia ukraine crisis ukrainians sheltered in bunkers see here photos
Russia-Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఈ ఫోటోస్ చూస్తే కన్నీళ్లు ఆగవు..
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. రోజూ రోజూకీ రష్యా.. ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. కళ్లముందు విధ్వంసం తప్ప మరేమి కనిపించడం లేదు. ఉక్రెయిన్ దేశంలో ఎక్కడ చూసిన స్మశాన నిశబ్దం అలుముకుంది. లక్షలాది మంది ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే మీ కళ్లు చెమ్మగిల్లకమానవు.
Updated on: Mar 04, 2022 | 11:57 AM

దాదాపు తొమ్మిది రోజులుగా ఉక్రెయిన్ పై భీకరమైన యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి ప్రజలు బంకర్లలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇప్పటికే వందలాది మంది దేశం విడిచి ఇతర దేశాలకు పారిపోతున్నారు. ప్రత్యేక రైళ్లు.. విమానాల ద్వారా ఇతర దేశాలకు తరలివెళ్తున్నారు.

కొందరు దేశం విడిచి పారిపోతుంటే.. మరికొందరు మాత్రం తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎదురునిలిచి పోరాటం చేస్తున్నారు.

చిన్న పిల్లలు.. నవజాత శిశువుల భవిష్యత్తు ఏంటీ అని ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజలలో ఉన్న సందేహం. తమ పిల్లలు ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నారో ఊహించుకోవడం కష్టంగా మారింది.

ఎంతో అందంగా ఉంటే భవనాలు ఇప్పుడు శిథిలాల దిబ్బంగా మారిపోయాయి. ఆకాశ హార్యాలు నేలమట్టమయ్యాయి. విధుల్లో స్మశాన నిశబ్దం అలుముకుంది. భవనాల రూపురేఖలు చూసేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

ఓవైపు బంకర్లలో గడుపుతునే.. మరోవైపు ఆకలితో అలమటిస్తున్నారు. సమయం ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవడానికి పదార్థాలను కొనుగోలు చేసేందుకు పరుగెడుతున్నారు.

శిథిలాల దిబ్బగా మారిన వీధులలో ఉక్రెయిన్ సైనికులు తిరుగుతున్నారు.. ఈ దృశ్యం చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి.

బాంబుల ధాటికి మసకబారిన భవనాలు.. కాలిబూడిదనైన వాహనాలు.. కూలిన ఇళ్లు.. దెబ్బతిన్న రహదారులు.. ఇలా ఒక్కటేమిటీ.. ఉక్రెయిన్ దుర్భర పరిస్థితి.




