- Telugu News Photo Gallery World photos Know these are the gorgeous locations where you can experience skydiving in india
స్కైడైవింగ్ చేయాలనుకుంటున్నారా ? అయితే మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు ఇవే..
సాహాసాలు చేయడానికి కొందరికి మాత్రమే ఆసక్తి.. ధైర్యం చాలా ఉండాలి.. స్కైడైవింగ్.. ఎంతగా థ్రిల్ ఉంటుందో.. అంతే ప్రమాదం కూడా. కానీ స్కైడైవింగ్ చేసేవారు ఎక్కువే ఉన్నారు. మన ఇండియాలో స్కైడైవింగ్ చేసేందుకు అందమైన ప్రదేశాలున్నాయి.
Updated on: Mar 16, 2022 | 12:39 PM

మైసూర్.. కర్ణాటకలోని చాముండి హిల్స్ దగ్గర స్కైడైవింగ్ బేస్ ఉంది. దాదాపు 3 గంటలు సమయం తీసుకునే టాండమ్ జంప్ ల కోసం ఇది సరైన ప్రదేసం.. కానీ ఇక్కడ స్కైడైవింగ్ చేయడానికి ముందు రోజు ప్రాక్టీస్ చేయాలి.. దాదాపు 4000 అడుగుల నుంచి ఒంటరిగ దూకేందుకు శిక్షణ ఇస్తారు. ఇక్కడ పది జంప్స్ చేయవచ్చు. ధర.. Tandem – Rs 35,000, Accelerated Free Fall – Rs 2,50,00

ధన.. మధ్యప్రదేశ్‌లో ధన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ విమానం పైనుంచి దూకుతున్నప్పుడు మీతోపాటు మీ ట్రైనర్ కూడా ఉంటాడు. మొదటి సారి ప్రయత్నించేవారికి సరైన ఎంపిక. ఇక్కడ టెన్డం జంప్ కు గ్రౌండ్ శిక్షణ అవసరం లేదు. ధర.. Tandem Jump- Rs 37,500, Static Jumps – INR 24,000

నార్నాల్.. హర్యానాలోని నార్నాల్ లోని బచోడ్ ఎయిర్ స్ట్రిప్‌లో ఈ అడ్వెంచర్ స్కైడైవింగ్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రైనర్ లేకుండా డైవ్ చేయాలనుకుంటే వారికి స్టాటిక్ లైన్ జంప్స్ లేదా త్రాడు కడతారు. దీంతో ఒంటరిగానే డైవ్ చేయవచ్చు. అలాగే పారచూట్స్ కూడా ఉంటాయి. ధర.. Static Line Jumps – Rs 18,500, Tandem Jumps – Rs 27500

దీసా.. గుజరాత్సో ఈ లేకే సైడ్ సిటీలో దీసా ప్రదేశం ఉంది. ఇక్కడ టెన్డం, ఎఎఫ్ఎఫ్ తోపాటు స్టాటిక్ లైన్ జంప్స్ వంటి మూడు రకాల జంప్స్ చేయవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్.. ఇండియన్ పారాచూటింగ్ ఫెడరేషన్ ఈ ప్రాంతంలో ఔత్సాహికుల కోసం క్యాంపులను ప్లాన్ చేస్తున్నారు. ధర.. Static Line Jumps – Rs 16,500, Tandem – Rs 33,500, AFF – Rs 37,500

పాండిచ్చేరి.. తమిళనాడులోని పాండిచ్చేరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ స్క్రైడవింగ్ చేయ్యోచ్చు. ఇక్కడ రకరకాల స్కైడైవింగ్స్ చేయ్యోచ్చు. ఇందుకు మీరు సౌకర్యవంతమైన దుస్తులు.. స్పోర్ట్స్ షూలను ధరించాలి. ధర.. Static Jumps – Rs 18,000 for one experience and 62,000 for 5 jumps, Tandem Jump – Rs 27,000




