- Telugu News Photo Gallery World photos Inside Shonke: the 900 year old Ethiopian village situated 5,200 feet above sea level
Shonke Village: 5,200 అడుగుల ఎత్తులో గ్రామం.. 900 ఏళ్ల నుంచి రెండే రెండు ద్వారాలు.. ఇంతకీ అదెక్కడంటే..?
ఇథియోపియాలోని ఓ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. 900 ఏళ్లనాటి ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది.
Updated on: Nov 07, 2021 | 1:39 PM

ప్రస్తుత అధునిక కాలంలో ఇల్లు కట్టడం ఒక గగనం.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పరిమాణం పెరగకపోవడంతో చిన్న చిన్న కుటీరాలకే పరిమితం కావల్సిన పరిస్థితి. అంతేకాదు. కట్టిన ఇళ్లు ఎదో కొద్దిరోజులకే కుప్పకూలి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అయితే, ఇథియోపియాలోని ఓ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. 900 ఏళ్లనాటి ఈ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ గ్రామంలో సందులు, దారులు, రహదారులు, అడ్డదారులు ఇలా చాలానే ఉన్నాయి. కానీ, ఆ గ్రామం మొత్తానికీ రెండే రెండు ద్వారాలు ఉన్నాయి. లోపల ఎన్ని సందుగొందులు తిరిగినా ఆ రెండు ద్వారాల నుంచే బయటికి,. లోపలికి రాకపోకలు సాగించాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే వందల కుటుంబాలు ఉన్నా, రెండు ద్వారాల ఇల్లులాంటి ఊరది. ప్రపంచంలోనే ఎల్తైన గ్రామాల్లో ఇదొకటి.

ఇథియోపియాలోని అమ్హారా అనే ప్రాంతంలో షోంకే అనే ఎత్తైన పర్వతశిఖరంపైన ఈ ప్రాచీన గ్రామం 900 ఏళ్ల క్రితం నాటిదని చరిత్ర చెబుతోంది. సముద్ర మట్టానికి 1,600 మీటర్లు, దాదాపు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ జీవించిన వారిలో 20 తరాలకు సంబంధించిన వివరాలు, లెక్కలతో కూడిన ఆధారాలు ఉన్నాయట. షోంకే ప్రజలను ‘అర్గోబా’ అని పిలుస్తారు. అంటే దాని అర్థం ‘అరబ్బులు లోపలకి వచ్చారు’ అని. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ ప్రాచీన సంప్రదాయాలను పాటిస్తూ.. తమ పురాతన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇస్లాం బోధనలో అక్కడున్న షోంకే మసీదు పేరు గాంచింది. అక్కడ ప్రాచీన తరహా ఇస్లాంని బోధిస్తారు. ప్రస్తుతం ఈ గ్రామ జనాభా దాదాపు సగానికి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇక్కడ దాదాపుగా 500 కుటుంబాలకు పైగానే ఉండేవి. కానీ ప్రస్తుతం 250 కుటుంబాలకు మాత్రం అయ్యాయి. చాలామంది గ్రామస్తులు వ్యవసాయం కోసం, కొండప్రాంతాలను ఆనుకుని ఉండే ఇతర ప్రాంతాలకు తరలిపోయారట.

మహ్మద్ ప్రవక్త ఇస్లాం మతం ప్రారంభించినప్పుడు ఆయాప్రాంతాల్లో కొన్ని ఘర్షణలు జరిగాయి. ఆ సందర్భంలో దాడుల నుంచి కాపాడేందుకు.. కొందరిని ఇథియోపియాలోని ఈ ప్రాంతానికి తరలించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి పాలకులు. భద్రత కారణాలతో ఈ గ్రామానికి కేవలం రెండు ద్వారాలే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ద్వారాల ముందు రక్షకులు కాపలా కాస్తుండేవారు.

‘ఇది మా పూర్వీకుల గ్రామం, అందుకే మేము దీన్ని వీడలేని జ్ఞాపకంగా భావిస్తాం. వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం మాకు ఇష్టంలేదు’ అంటున్నారు మిగిలిన స్థానికులు. ఇప్పటికీ స్థానికంగా లభ్యమయ్యే రాళ్లతోనే వాళ్లు ఇళ్లు కట్టుకుంటారు. నగరాల్లోని హంగులు, ఆర్భాటాలను వీళ్లు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఈ గ్రామం పర్యాటక ఆకర్షణగా నిలిచిందని షాంకే వాసులు గర్వంగా చెబుతున్నారు.
