World Photos: ప్రపంచంలోనే వింతైన చెట్లు.. ఇప్పటికీ బయటపడని రహస్యం.. నిపుణులకే ఆశ్చర్యం..

మన భూమి మీద ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నోరకాల వింతలు ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని చెట్లకు సంబంధించి మిస్టరీ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అవెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: Jun 26, 2021 | 2:22 PM

ఈ ప్రపంచంలో చాలా రకాల చెట్లు ఉన్నాయి. అందులో కొన్ని కంటికి అందంగా కనిపించే చెట్లు కాగా.. మరికొన్ని భయంకరంగా కనిపిస్తుంటాయి. అలాగే విషపు చెట్లు... ప్రాణాలను కాపాడే మూలికలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి.

1 / 6
గ్రేట్ సీక్వోయా ట్రీ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టు. ఇది చూడడానికి భయంకరంగా కనిపిస్తుంది. అమెరికాలో ఉన్న ఈ భారీ వృక్షం బరువు 27 లక్షల పౌండ్లు. దీని వయస సుమారు 2300-2700 ఉండగా.. 275 అడుగుల పొడవు ఉంటుంది.

2 / 6
ఈ చెట్టు సరిగ్గా బాటిల్ మాదిరిగా ఉంటుంది. అందుకే దీనిని బాటిల్ ట్రీ అంటారు. ఇది పూర్తి విషపూరితం. పాత రోజుల్లో వేటగాళ్లు, ఈ చెట్టు నుంచి వచ్చే రసాన్ని తమ బాణాలపై ఉపయోగించేవారట.

3 / 6
దక్షిణ అమెరికాలో ఉన్న ఓ చెట్టుపై కాయలు కొమ్మలపై కాకుండా.. చెట్టు బెరడుపై అంటే మొండెంపై కాస్తాయి. దీనిని జబూటికాబా అని పిలుస్తుంటారు

4 / 6
యెమెన్ లోని సోకోట్రా ద్వీపాన్ని ఏలియన్ ఐలాండ్ అని పిలుస్తారు. అక్కడ డ్రాగన్ బ్లడ్ ట్రీ అనే చెట్టు పూర్తిగా రక్తంలాగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ చెట్టు విచిత్రమైన ఆకృతిని కలిగి ఉంటుంది.

5 / 6
జపాన్ లోని విస్టేరియా అనే చెట్టు ప్రపంచంలోనే అత్యంత అందమైన చెట్టు. ఇది పూర్తిగా పూలతో కప్పబడి ఉంటుంది. కొన్ని చోట్ల గులాబి పువ్వులు, నీలం పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులు పూర్తిగా వికసించడానికి దాదాపు ఐదు నుంచి 15 సంవత్సరాలు పడుతుందట.

6 / 6
Follow us