- Telugu News Photo Gallery Womens Day 2024: Important Legal Rights Every Married Woman In India Should Know
Legal Rights for Married Women: ప్రతి వివాహిత ఈ 4 చట్టాలు తప్పక తెలుసుకోవాలి.. ఇవి మీ వైవాహిత జీవితానికి అస్త్రాలు!
వివాహం గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వివాహ వ్యవస్థ మంచిదని కొందరు సపోర్ట్ చేస్తే, చెడ్డదని మరి కొందరు అంటుంటారు. కానీ వివాహం అనేది ఒక వ్యక్తికి చెందిన వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తి తాను పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు తన వివాహం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో రకరకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. కొన్ని కోర్టు వివాహాలు, కొన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, మరికొన్ని సంప్రదాయ వివాహాలు.. ఇలా ఎన్నోరకాలు ఉన్నాయి. కానీ చాలా మంది వైదిక పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు..
Updated on: Mar 08, 2024 | 7:52 PM

వివాహం గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వివాహ వ్యవస్థ మంచిదని కొందరు సపోర్ట్ చేస్తే, చెడ్డదని మరి కొందరు అంటుంటారు. కానీ వివాహం అనేది ఒక వ్యక్తికి చెందిన వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తి తాను పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు తన వివాహం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో రకరకాల వివాహ పద్ధతులు ఉన్నాయి. కొన్ని కోర్టు వివాహాలు, కొన్ని డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, మరికొన్ని సంప్రదాయ వివాహాలు.. ఇలా ఎన్నోరకాలు ఉన్నాయి. కానీ చాలా మంది వైదిక పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

పెళ్లి ఎలా చేసుకున్నా.. నేటి కాలంలో వివాహానంతంర రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని చట్టాలు ఉన్నాయి. అన్నింటిలో మొదటిది గృహ హింస. 2005 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా లేదా ఆర్థికంగా వేధిస్తే మీరు చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. పెళ్లి తర్వాత ఆడపిల్లల భద్రత, సంక్షేమం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. భారతీయ చట్టం ప్రకారం మానవులందరికీ సమాన సమానత్వం, గౌరవంతో జీవించే హక్కు ఉంది. ఈ ప్రాథమిక హక్కులు వివాహితులందరికీ సమానంగా వర్తిస్తాయి. ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను రక్షించడం.

1862 నాటి మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం ఉద్యోగం చేసే మహిళలకు ప్రసూతి సెలవులు, వేతనాలు అందిచడం జరుగుతుంది. 1956 హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుమార్తెలు కూడా వారి తల్లిదండ్రుల ఆస్తికి అర్హులే. అలాగే ఆడపిల్లలు ఇతర బంధువుల నుంచి కూడా ఆస్తి పొందవచ్చు.

1961లో వరకట్న నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం విషయంలో అనవసరమైన వేధింపులకు గురి చేసినా లేదా వరకట్నం కోసం నిరంతరం ఒత్తిడికి గురి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. సమాన వేతన చట్టం 1976లో వచ్చింది. అంటే స్త్రీ పురుషుల మధ్య రెమ్యునరేషన్ తేడా ఉండదు. ఇది ఇద్దరికీ సమానంగా ఉంటుంది. ఈ చట్టం మహిళలు వివాహం చేసుకున్నప్పటికీ, ఏ విధంగానూ ఆర్థిక వివక్షకు గురికాకూడదని చెబుతుంది. ఈ విషయంలో మీరు వివక్షకు గురవుతున్నట్లు భావిస్తే వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

మెడికల్ డయాగ్నోసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 చట్టబద్ధమైన అబార్షన్ హక్కును కల్పించింది. గర్భం దాల్చిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి అమ్మాయికి ఈ హక్కు ఉంటుంది. ఈ చట్టం కింద మీరు సురక్షితమైన, నిర్దిష్ట చికిత్సను పొందవచ్చు.




