- Telugu News Photo Gallery Why does eating Spicy food make your nose and eyes water? What does science say?
కారం తింటే ముక్కు, కళ్ల నుంచి నీరెందుకు కారుతుంది.? సైన్స్ ఏం చెబుతుంది.?
కొందరు మిరపకాయలను తినడానికి ఇష్టపడతారు. ఇది తిన తర్వాత కొందరికి ఒకొక్కసారి కళ్లు, ముక్కులో నీరు రావడం మొదలవుతుంది. కారం అధికంగా తింటే ముక్కు, కళ్లలో నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే ఎందుకు ఇలా కళ్లు, నీరు నుంచి నీరు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ విషయం గురించి ఈరోజు మనం పూర్తి వివరణతో తెలుసుకుందాం..
Updated on: Aug 06, 2025 | 1:27 PM

వండిన చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం.. పచ్చి చికెన్‌ను 1-2 రోజుల వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండం అంత మంచిదికాదు. రెండు రోజులకుమించి పచ్చి చికెన్‌ను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోవడమే మంచిది.

కారం ఎక్కువైనా సరే.. లేదా మిరపకాయను కోరికిన వెంటనే నోటి నుండి హుస్ అనే శబ్దం చేస్తారు. నోరు మొత్తం మండిపోతుంది. అప్పుడు వెంటనే చేతి నీటి గ్లాసు కోసం వెతుకుతుంది. మరోవైపు ముక్కు, కళ్ళ నుండి నీరు ప్రవహిస్తుంది.

ఇలా కారం తిన్న వెంటనే నోరు మండటానికి కారణం చాలా మందికి తేలింది. మీకు ఈ ప్రశ్న కొన్ని సార్లు వచ్చి ఉంటుంది. ఈ విషయంపై అమెరికన్ కెమికల్ సొసైటీ గతంలో ఒక అధ్యయనం చేసింది. ఇందులో ఆసక్తికార విషయాన్ని వెల్లడించింది.

మిరపకాయలో కెప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. మిరపకాయకు ఇది ఒక రక్షణ కవచం అని తెలుస్తోంది. ఎందుకంటే జంతువులు, మానవులు ఈ రసాయనాల వలన మిర్చి మొక్కను టచ్ చేయలేరు. ఒక రకంగా కెప్సైసిన్ అనే రసాయనం మిర్చిని కాపాడుతుందన్నమాట.

ఈ రసాయన స్వభావంతో నోటికి తగిలిన వెంటనే శరీరంలో మంటను కలిగిస్తుంది. దీని తర్వాత మన శరీరం రక్షణలోకి వెళుతుంది. కెప్సైసిన్ రసాయనం శరీరాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే శరీరంలోని ముక్కు, కళ్ల నుంచి ఆ రసాయనాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా ముక్కు, కళ్ళ నుండి నీరు రావడం ప్రారంభమవుతుంది.




