- Telugu News Photo Gallery Spiritual photos Varalakshmi Vratam 2025, rules which all 12 zodiac signs should follow for Varalakshmi Puja
Varalakshmi Vratam Astro Tips: వరలక్ష్మీవ్రతం రోజున లక్ష్మీదేవి పూజని మీ రాశి ప్రకారం ఎలా చేయడం ఫలవంతం అంటే..
శ్రావణ మాసం మగులకు ఎంతో ఇష్టమైన నెల. ఈ నెలలో చేసే నోములు, వ్రతాలు ఫలవంతం అని నమ్మకం. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన దీర్ఘసుమంగళి వరం లభిస్తుందని నమ్మకం. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతాన్ని ఆగష్టు 8వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోనున్నారు. ఈ నేపద్యంలో లక్ష్మీదేవిని పూజని మహిళలు తమ రాశి ప్రకారం కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
Updated on: Aug 06, 2025 | 2:43 PM

హిందు సంప్రదాయంలో వరలక్ష్మీ వ్రతానికి విశిష్టత ఉంది. ఈ పండగను తెలుగువారు ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయినప్పటికీ పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం అత్యంత ఫలవంతమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగష్టు ఆగస్టు 8వ తేదీన జరుపుకోవడానికి మహిళలు రెడీ అవుతున్నారు. ఈ రోజున అత్యంత భక్తిశ్రద్దలతో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వలన భర్తకు దీర్ఘాయువుని ఇంట్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. అయితే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం జరుపుకునే మహిళలు తమ రాశి ప్రకారం పరిహారం చేయడం అత్యంత ఫలవంతం. శుభఫలితాలు లభిస్తాయి.

మేష రాశి: ఈ రాశికి చెందిన మహిళలకు కోపం స్వభావం ఎక్కువ. కనుక కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో తరచుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకనే ఈ రాశికి చెందిన మహిళలు వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే తామర పువ్వు, గులాబీ, మందారం పువ్వులతో పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. ఈ పరిహారాలు చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.

వృషభ రాశి: వీరు అత్యంత సోమరితనం కలిగిన వ్యక్తులు. దీంతో తమకి వచ్చిన అవకాశాలు కూడా కోల్పోతారు. ఈ రాశికి చెందిన మహిళలు శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అనుగ్రహం కోసం బియ్యం పాయసం లేదా బూరెలు వంటి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా చేయడం వలన జాతకంలో దోషాలు తగ్గుతాయి.

మిథున రాశి: మిథున రాశి మహిళలు తరచుగా మానసిక ఒత్తిడి గురవుతూ ఉంటారు. దీంతో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం రోజున ఆవుకు ఆహారాన్ని అందించండి. అవుకు పచ్చగడ్డి, అరటి పండ్లు వంటి ఆహారాన్ని అందించడం శుభాలను కలిగిస్తుంది.

కర్కాటక రాశి: వీరు చిన్న చిన్న విషయాలకే చాలా బాధపడతారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. కనుక వీరు వ్రతం అనంతరం తెల్లటి వస్త్రాలను పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వలన మేలు కలుగుతుంది

సింహ రాశి: ఈ రాశి వారు తమ ఉన్నతిని చూసుకుని అప్పుడప్పుడు గర్వం, అహంకారానికి లోనవుతూ ఉంటారు. ఈ కారణంగా స్నేహితులు, సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. కనుక వీరు వరలక్ష్మీ వ్రతం ముగిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని పేదవారికి అందించండి. వారికీ తగిన సహాయం చేయడి. ఇలా చేస్తే జాతకంలో గ్రహ దోషాలు తొలగుతాయి.

కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆలోచనాపరులు. అందుకనే నిర్ణయం తీసుకోవడానికి జాప్యం చేస్తారు. కనుక వరలక్ష్మీ వ్రతం పూజ ముగిసిన అనంతరం విష్ణు సహస్రనామం లేదా లక్ష్మీ అష్టోతరం పఠించండి. ఇలా చేయడం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి.

తులా రాశి: తులా రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరు వరలక్ష్మీ వ్రతం రోజు తులసి మొక్క దగ్గర దీపం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తీరతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు అనుమానం, అపనమ్మకంతో ఉంటారు. వీరు వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీదేవి పూజ ముగిసిన తర్వాత కందులు, బెల్లం దానం చేయడం మేలు చేస్తుంది. దోషాలు తొలగి సానుకూలత కలుగుతుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. దీంతో వీరు తరచుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. కనుక వీరు ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవికి పసుపు పూలతో పూజ చేయడం వలన సానుకూల ఫలితాలు లభిస్తాయి.

మకర రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెందుతారు. పని విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటూ ఉంటారు. కనుక ఈ రాశి వారు వరలక్ష్మీ వ్రతం రోజు శనీశ్వరుడి అనుగ్రహం కోసం శని ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం పెట్టడం మంచిది.

కుంభ రాశి: ఈ కుంభ రాశికి చెందిన మహిళలు తొందరపాటు తనం వలన ఇతరులు ఇబ్బంది పడుతుంటారు. సమస్యలు ఎదుర్కుంటారు. కనుక వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మి పూజ అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం శుభప్రదం. స్థిరత్వం ఏర్పడుతుంది. దోషాలు తొలగుతాయి.

మీన రాశి: వీరు ఇతరుల మాటల వలలో పడతారు. దీంతో తరచూ నష్టపోతూ.. సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. కనుక వీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం రోజు పూజ ముగిసిన అనంతరం గోమాతకు పూజ చేయడం. తర్వాత ఆవుకి పచ్చగడ్డిని ఆహారంగా అందించండి.




