- Telugu News Photo Gallery White hair is sure to turn black with these hair packs, check here is details in Telugu
White Hair Problem: ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేశారంటే.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..
ఇప్పుడున్న కాలంలో యువతని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. ఆహారం, నీరు, వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు తెల్లగా అవుతుంది. నిజంగానే ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. ఈ వైట్ హెయిర్‌ను కవర్ చేసుకోవడానికి.. ఆర్టిఫిషియల్ రంగులు, హెన్నాలు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇకపై ఇలాంటి తిప్పలు పడకుండా.. మన డైట్‌లో కొన్ని మార్పులు చేసుకుని, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మన ఇంట్లో దొరికే కొన్ని..
Updated on: Jul 29, 2024 | 5:51 PM

ఇప్పుడున్న కాలంలో యువతని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. ఆహారం, నీరు, వాతావరణ పరిస్థితుల కారణంగా జుట్టు తెల్లగా అవుతుంది. నిజంగానే ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు. ఈ వైట్ హెయిర్‌ను కవర్ చేసుకోవడానికి.. ఆర్టిఫిషియల్ రంగులు, హెన్నాలు పెట్టుకోవాల్సి వస్తుంది.

కానీ ఇకపై ఇలాంటి తిప్పలు పడకుండా.. మన డైట్‌లో కొన్ని మార్పులు చేసుకుని, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే.. సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మన ఇంట్లో దొరికే కొన్ని రకాల హోమ్ రెమిడీస్‌తో కూడా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజూ ఉసిరి జ్యూస్ తాగండి. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం పూట డైలీ 15 మిల్లీ మీటర్ల ఉసిరి జ్యూస్ తాగాలి. చాలా తక్కువ సమయంలోనే మీ జుట్టు నల్లగా, బలంగా, దృఢంగా మారుతుంది.

నల్ల జీలకర్ర దీన్నే కలోంజీ సీడ్స్ అని కూడా ఉంటారు. వీటిల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. వీటితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. గోధుమ గడ్డితో కూడా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ప్రతి రోజూ మీ భోజనంలో ఒక స్పూన్ గోధుమ గడ్డి ఉండేలా చూసుకోండి.

జుట్టుకు బెస్ట్ ఫ్రెండ్ అంటే కరివేపాకు అని చెప్పొచ్చు. తెల్ల జుట్టుతో బాధ పడేవారు మీ డైట్‌లో కరివేపాకు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే కరివేపాకు జ్యూస్ తాగినా మంచిదే. అంతే కాకుండా కరివేపాకు ఆయిల్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేసినా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.





























