- Telugu News Photo Gallery What kind of problems will happen if you drink too much ginger tea? check here is details
Ginger Tea: అల్లం టీ ఎక్కువగా తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
టీ అంటే చాలా మందికి ఇష్టం. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. టీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో అల్లం టీ కూడా ఒకటి. అల్లంలో టీలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి రోజూ రెండు సార్లు చిన్న టీ కప్పుతో టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అంతకు మించి అల్లం టీని తాగితే మాత్రం సమస్యలు తప్పవు. వర్షా కాలంల, చలి కాలంలో తప్పించి.. వేసవి కాలంలో అల్లం టీ తాగకూడదు. దీని వల్ల బీపీ అనేది బాగా తగ్గిపోతుంది. అందుకే వేసవిలో అల్లం టీని ఒక కప్పుకు మించి..
Updated on: Sep 22, 2024 | 5:26 PM

టీ అంటే చాలా మందికి ఇష్టం. ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. టీల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో అల్లం టీ కూడా ఒకటి. అల్లంలో టీలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి రోజూ రెండు సార్లు చిన్న టీ కప్పుతో టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అంతకు మించి అల్లం టీని తాగితే మాత్రం సమస్యలు తప్పవు.

రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగును చేర్చుకోవాలి. ప్రతిరోజూ పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా పేగుల్లో చేరి జీర్ణ క్రియను క్రమబద్దీకరిస్తాయి. పెరుగు కడుపుని చల్లగా ఉంచుతుంది కూడా. అయితే కొంత మందికి లాక్టోస్ అలర్జీ ఉంటుంది. ఇటువంటి వారు పాలు లేదా పాల ఉత్పత్తులు తినడం వళ్ల శరీరంపై దద్దుర్లు వస్తాయి. వీళ్లు పెరుగు తినకపోవడమే మంచిది.

అల్లం జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అల్లం తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

అల్లం టీ ఎక్కువగా తాగితే రక్తాన్ని చాలా పలుచగా చేస్తుంది. దెబ్బలు తగిలినప్పుడు సన్నగా రక్తం కారుతూ ఉంటుంది. ఇలా రక్తాన్ని కలిగి ఉంటే.. అల్లం టీని తాగడం మానేయండి. ఇది రక్తాన్ని మరింత పల్చగా చేస్తుంది. అల్లం టీ ఎక్కువగా తాగితే అలెర్జీ కూడా వస్తుంది.

లో బీపీ సమస్యతో బాధ పడేవారు అల్లం టీ తాగితే.. రక్త పోటు అనేది మరింత తగ్గే ప్రమాదం ఉంది. ఇలా బీపీ తక్కువగా ఉంటే.. ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా అల్లం టీ అస్సలు తాగకూడదు. ఇది వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




