మీరు డైలీ అవకాడో తింటున్నారా..? లేదంటే ఈ లాభాలన్నీ మిస్‌ అయినట్టే..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంతో పాటు వీలైనంత ఎక్కువగా పండ్లు తినాలని పోషకాహార నిపుణులు పదే పదే చెబుతున్నారు. పండ్లు మన శరీరంలోని అనేక ముఖ్యమైన పోషకాల లోపాన్ని తీరుస్తాయి. పండ్లు తింటే ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వాస్తవం కూడా. ఆరోగ్యానికి మేలుచేసే పండ్లలో అవకాడో కూడా ఒకటి. ఈ పండులో పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, కాపర్, జింక్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడంవల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవకాడో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Aug 10, 2024 | 3:18 PM

అవకాడోలో ప్రొటీన్లు, విటమిన్లు, మినర్స్ పుష్కలంగా ఉంటాయి. అవకాడోలోని పైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు పెరగాలి అనుకునే వారికి అవకాడో చాలా ఉపయోగపడుతుంది. అవకాడోలోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మకాంతిని పెంచి అందాన్ని మెరుగుపరుస్తాయి.

1 / 5
షుగర్‌ వ్యాధితో ఇబ్బంది పడుతున్న వారు తరచూ అవకాడో తినాలి. దీన్ని తినడంవల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2 / 5
అవకాడోలోని హెల్తీ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవకాడో రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అవకాడో ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది. అకాడోలోని కాల్షియం ఎముకలను బలంగా మార్చుతాయి.  మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే అవకాడో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు అవకాడో తప్పక తినాలి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అవకాడోలో కంటిని చూపును మెరుగుపర్చే పోషకాలు ఉన్నాయి.  అంతేకాదు.. అవకాడోలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీని రెగ్యులర్ వినియోగం మీ ఎముకలకు బలాన్నిస్తుంది.

4 / 5
అవకాడో రోజూ తినటం వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి కూడా ఈ పండు చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలవల్ల కీళ్ల నొప్పులు, వాపులు, ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ల నుంచి అయినా ఉపశమనం పొందవచ్చు.

5 / 5
Follow us