- Telugu News Photo Gallery What happens when you add ghee to coffee and drink it? Check Here is Details
Ghee in Coffee: కాఫీలో నెయ్యి కలుపుకుని తాగి ఏం జరుగుతుందంటే..
కాఫీ అంటే ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం ఓ కప్పు కాఫీ తాగితే చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి రిలీఫ్ కూడా దొరుకుతుంది. కాఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెయ్యి కాఫీ అనేది బాగా ఫేమస్ అవుతుంది. ఈ నెయ్యి కాఫీని బుల్లెట్ కాఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం సెలబ్రిటీలు, జిమ్ ట్రైనర్లు అందరూ దీన్ని తాగేందుకు ఇంట్రెస్ట్..
Updated on: Oct 09, 2024 | 6:28 PM

కాఫీ అంటే ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం ఓ కప్పు కాఫీ తాగితే చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి రిలీఫ్ కూడా దొరుకుతుంది. కాఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెయ్యి కాఫీ అనేది బాగా ఫేమస్ అవుతుంది.

ఈ నెయ్యి కాఫీని బుల్లెట్ కాఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం సెలబ్రిటీలు, జిమ్ ట్రైనర్లు అందరూ దీన్ని తాగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ నెయ్యి కాఫీ తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పుడు చూద్దాం.

కాఫీలో, నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల ఎక్కువ శక్తి లభిస్తుంది. ఉదయం ఈ కాఫీ తాగితే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

నెయ్యి కాఫీలో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఉదయం నీళ్లు తాగక ఈ కాఫీ తాగితే తక్కువ సమయంలోనే అధిక బరువు, ఊబకాయం కూడా తగ్గుతుంది.

మెదడు కూడా యాక్టీవ్ అవుతుంది. మతి మరుపు వంటి సమస్యలు తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్ అవుతాయి. మంచి హెల్దీ స్కిన్ మీ సొంతం అవుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




