- Telugu News Photo Gallery These are the best vegetables to increase memory power, Check Here is Details in Telugu
Foods for Memory Power: ఏదీ గుర్తుకు ఉండటం లేదా.. త్వరగా మర్చిపోతున్నారా.. ఇలా చేయండి!
ప్రస్తుత జీవన శైలిలో రోగాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. లైఫ్ స్టైల్‌లో మార్పులు చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీన పడి.. వ్యాధులు అనేవి ఎటాక్ చేస్తున్నాయి. ఇలా మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతిని.. జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది. జ్ఞాపక శక్తి లోపించడం వల్ల ఏ విషయం అనేది త్వరగా గుర్తుకు ఉండదు. మెదడులోని కణాలు కూడా దెబ్బతిని.. పని తీరు మందగిస్తుంది. ఇప్పుడు చెప్పే ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకుంటే మీ జీవన విధానం మారిపోతుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో బీట్ రూట్ ఎంతో చక్కగా..
Updated on: Oct 09, 2024 | 6:04 PM

ప్రస్తుత జీవన శైలిలో రోగాలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. లైఫ్ స్టైల్‌లో మార్పులు చేయడం వలన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీన పడి.. వ్యాధులు అనేవి ఎటాక్ చేస్తున్నాయి. ఇలా మెదడు ఆరోగ్యం కూడా దెబ్బతిని.. జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది. జ్ఞాపక శక్తి లోపించడం వల్ల ఏ విషయం అనేది త్వరగా గుర్తుకు ఉండదు. మెదడులోని కణాలు కూడా దెబ్బతిని.. పని తీరు మందగిస్తుంది. ఇప్పుడు చెప్పే ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకుంటే మీ జీవన విధానం మారిపోతుంది.

నిపుణుల ప్రకారం.. మీ జ్ఞాపకశక్తిని సులభంగా పెంచుకోవడానికి కొన్ని 'రీకాల్ పద్ధతులను' అనుసరించడం మంచిది. దీని వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా ముఖ్యమైన విషయాలను మరచిపోకుండా చూసుకోవచ్చు.

క్యాప్సికమ్, బ్రోకలీ కూడా మెదడును ఆరోగ్యంగా పని చేసేలా చేస్తాయి. వీటిల్లో విటమిన్ సి, విటమిన్ కే పెద్ద మొత్తంలో లభిస్తాయి. కాబట్టి ఇవి బ్రెయిన్ కణాల్ని ఆక్సిడెటివ్ స్ట్రెస్‌కి గురి కాకుండా చేస్తుంది.

మీరు గుర్తుంచుకోవాలనుకుంటున్న విషయం లేదా వస్తువు మొదటి అక్షరాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అక్షరం సహాయంతో మీరు సులభంగా గుర్తుంచుకోగలరు. సాధారణంగా ఇది త్వరగా మరచిపోకుండా చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా చిన్న పిల్లలకు కూడా ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది.

మనం తరచూ తినాల్సిన ఆకు కూరల్లో పాలకూర కూడా ఒకటి. పాలకూర తిన్నా.. రసం తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. మతి మరుపు సమస్యతో బాధ పడేవారు తరచూ పాలకూర తీసుకుంటే అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ లభిస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




