AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ గింజలు నానబెట్టిన నీళ్లు మీరూ తాగుతున్నారా?

మెంతి గింజలను సుగంధ ద్రవ్యాల మాదిరి వంటల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే ఇవి ప్రతి ఇంటి వంగ గదిలో ఉంటాయి. మెంతులు ఆహార రుచిని పెంచడమే కాకుండా, మహిళల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మెంతి గింజలు నానబెట్టిన నీళ్లు పలు ఆరోగ్య సమస్యల నివారణకు భలేగా ఉపయోగపడతాయి. ఇవి ఏ సమస్యలకు ప్రభావవంతంగా పని చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Nov 14, 2025 | 9:04 PM

Share
మెంతుల్లోని ఫైటోఈస్ట్రోజెన్ భాగాలు మహిళల హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. మెంతి గింజలు క్రమరహిత పీరియడ్స్, మూడ్ స్వింగ్స్, PCOS కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

1 / 5
పురాతన కాలం నుంచి మెంతులు సుగంధ ద్రవ్యాలు, ఔషధ మూలికగా ఉపయోగించబడుతున్నాయి. వరుసగా 15 రోజులు నానబెట్టిన మెంతులు, దాని నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ఇది PCOS లో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మెంతుల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే మెంతులు మహిళలు ప్రతి రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

3 / 5
నానబెట్టిన మెంతులు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడతాయి. జీవక్రియను పెంచుతాయి. తద్వారా బరువు నియంత్రణలో సహాయపడతాయి. మెంతుల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కాంతిని పెంచుతాయి. మొటిమలను తగ్గిస్తాయి. జుట్టు రాలడం,చుండ్రును తగ్గిస్తాయి. మెంతి గింజలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.

4 / 5
మెంతుల నీళ్లు పీరియడ్స్‌ సమయంలో వచ్చే అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తాయి. మెంతులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తలనొప్పి, కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు పాలిచ్చే తల్లులకు కూడా ఎంతో మంచిది. అయితే వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వీరు మెంతులు తినడం మంచిది.

5 / 5