2028లో ఊహించని పరిస్థితి.. బాబావంగా ఏం చెప్పారంటే?
ప్రసిద్ధ జ్యోతిష్యుల్లో బాబా వంగా ఒకరు. ఈయన బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈమె జ్యోతిష్యం చాలా విషయాల్లో నిజం కావడంతో చాలా మంది ఈవిడ చెప్పినవి నమ్ముతుంటారు. ముఖ్యంగా జరగబోయే విషయాలను అంచనా వేసి చెప్పడంలో ఈవిడకు మించిన వారు లేరు.
Updated on: Jun 29, 2025 | 8:00 AM

ప్రసిద్ధ జ్యోతిష్యుల్లో బాబా వంగా ఒకరు. ఈయన బల్గేరియా దేశానికి చెందిన ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈమె జ్యోతిష్యం చాలా విషయాల్లో నిజం కావడంతో చాలా మంది ఈవిడ చెప్పినవి నమ్ముతుంటారు. ముఖ్యంగా జరగబోయే విషయాలను అంచనా వేసి చెప్పడంలో ఈవిడకు మించిన వారు లేరు. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది అది ఏమిటంటే? 2028 వ సంవత్సరంలో ఊహించని పరిస్థితులు ఎదురు కాబోతున్నాయంట. అవి ఏవో ఇప్పుడే మనం వివరంగా తెలుసుకుందాం.

బాబా వంగా సమాజంలో జరిగే సంఘటనలను ముందే ఊహించి చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి. మరీ ముఖ్యంగా 2020లో కరోనా వైరల్ అనే మహమ్మారి ప్రపంచాన్నే చుట్టి వేసి ముప్పు తిప్పలు పెడుతుందని బాబా వంగా తెలిపారు. ఆమె చెప్పిందే నిజం అయ్యింది. అయితే ఇప్పుడు 2028లో ఏం జరగబోతుందో బాబా వంగా అంచనావేసి, వాటి పరిణామాలను తెలియజేసింది.

2028లో ఊహించని విధంగా ప్రపంచం మారబోతుందంట. రానున్న భవిష్యత్తులో ప్రపంచం నుంచి ఆకలి శాశ్వతంగా దూరమవుతుందంట. అంతే కాకుండా మానవులు తమకు ఉన్న శక్తితో ఏదైనా సాధించగలరు. ఎన్నింటినో కనుగొంటారని బాబా వంగా తెలియజేయడం జరిగింది. మానవులు కనుగొనే ప్రత్యేకమైన శక్తి వలన ఆకలి అనేది నశిస్తుందంట. అంతే కాకుండా కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తారు. మరీ ముఖ్యంగా చంద్రుడిపై కాదు ఏకంగా శుక్రగ్రహంపైనే ప్రత్యేక భూమిని కనుగొంటారని ఆమె తెలిపిందే.

అదే విధంగా ఆ గ్రహంపై మనుగడ సాధించేదుకు అనేక ప్రయోగాలు చేస్తారని ఆమె ఊహించి తెలిపింది. అంతే కాకుండా చాలా వరకు గ్రహాలు మానవులను ఆకర్షిస్తాయంట. దీంతో 2028లో మనుషులు కొన్ని అద్భుతమైన శక్తి వనరులను కనుగొని అనేక సమస్యల నుంచి వారిని వారు కాపాడుకుంటారంట. అలాగే వాయువలతో కూడా ప్రత్యే పరిశోధన చేస్తారని ఆమె వివరించింది.

2028 సంవత్సరంలో మానవులు అంతరిక్ష యాత్ర ద్వారా అంగారక గ్రహంపైకి వెళ్లి పరిశోధనలు చేస్తారని ఆమె తెలిపిందే. ఇవే కాకుండా రానున్న సంవత్సరాల్లో ఏఐ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందంట. వాటికి అవయవాలు కూడా తయారవుతాయని బాబా వంగ తెలపారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



