AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్లలో గురక సమస్య.. కారణాలు ఇవే..! నివారణ మార్గాలు..

గురక సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. గురకపెట్టే వారు ఉన్న గదిలో నిద్రపోయే వారి పరిస్థితి నరకం కంటే తక్కువేం కాదని చెప్పాలి. ఎందుకంటే..ఆ శబ్దాలకు చెవులు గట్టిగా మూసుకోవాలనిపిస్తుంది. నిద్ర పట్టదు. పడుకున్నప్పుడు ముక్కు లేదా గొంతుకు సరిగ్గా గాలి వెళ్లనప్పుడు గురక వస్తుంది. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా గురకపెడుతుంటారు. అయితే, స్త్రీలు గురక పెట్టడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Dec 04, 2023 | 1:44 PM

Share
గురక పెట్టే వ్యక్తులు ఇతరులకు కలిగించే అసౌకర్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గురక అనేది కేవలం విసుగు మాత్రమే కాదు, అనారోగ్య సమస్యలకు సంకేతం కూడా అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
జలుబు, అలెర్జీలు వంటివి మీ శ్వాస ఆడే గాలి మార్గాన్ని నిరోధించడానికి కొన్ని సాధారణ కారణాలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక గురక అనేది లోతైన సమస్య, తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి సంకేతం అంటున్నారు నిపుణులు. గురక ఊపిరి ఆడకపోవడం, నోరు, గొంతు, శ్వాసలోపం సమస్యకు సంకేతం కావచ్చు.

2 / 5
గర్భధారణ సమయంలో స్త్రీలు అదనపు బరువు పెరగడం, నాసికా కుహరంలోని రక్త నాళాలు వ్యాకోచించడం వలన కూడా గురక సమస్య తలెత్తుతుంది. అలాగే, అతిగా అలసిపోయినప్పుడు కండరాలకు విశ్రాంతి అవసరం. స్వరపేటిక చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గురక వస్తుంది.

3 / 5
అధిక బరువు, మెడ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వు కారణంగా కూడా గురక వస్తుంది. ఈ అదనపు కొవ్వు శ్వాస మార్గాన్ని అడ్డుకుంటుంది. గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో బిగ్గరగా గురకకు దారితీస్తుంది.

4 / 5
మీ కండరాలు చాలా అలసిపోయి, అతిగా రిలాక్స్ అవుతాయి. అప్పుడు కూడా గురకకు దారి తీస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, అది గొంతు బొంగురుపోవడం, నెమ్మదిగా మాట్లాడటం, గుండె దడ వంటి సమస్యలను కలిగిస్తుంది. అదనంగా, ఈ పరిస్థితి గురకకు దోహదం చేస్తుంది.

5 / 5