- Telugu News Photo Gallery These Signs indicate before goddess Lakshmi devi will enter your house, check here is details
Spirituality Tips: ఈ సంకేతాలు కనిపించినా.. వినిపించినా.. ఇంట్లో డబ్బే డబ్బు!
ఇప్పుడున్న రోజుల్లో డబ్బులేనిదే ఏ పని జరగదు. ప్రతీది ఇప్పుడు డబ్బుతోనే ముడి పడి ఉంటుంది. డబ్బంటే ఎవరి చేతు చెప్పండి.. ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉండాలని కోరుకోని వ్యక్తి ఉండరు. డబ్బుతోనే సమాజంలో, బంధువుల మధ్య గౌరవం వస్తుంది. డబ్బు అంటేనే.. లక్ష్మీ దేవి.. ఆవిడను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపించినా.. వినిపించినా.. లక్ష్మీ దేవి ప్రసన్నం కలుగుతుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని స్వప్న శాస్త్రం..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 04, 2023 | 8:19 PM

ఇప్పుడున్న రోజుల్లో డబ్బులేనిదే ఏ పని జరగదు. ప్రతీది ఇప్పుడు డబ్బుతోనే ముడి పడి ఉంటుంది. డబ్బంటే ఎవరి చేతు చెప్పండి.. ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉండాలని కోరుకోని వ్యక్తి ఉండరు. డబ్బుతోనే సమాజంలో, బంధువుల మధ్య గౌరవం వస్తుంది. డబ్బు అంటేనే.. లక్ష్మీ దేవి.. ఆవిడను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపించినా.. వినిపించినా.. లక్ష్మీ దేవి ప్రసన్నం కలుగుతుందని, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని స్వప్న శాస్త్రం చెబుతుంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

కలలో పసుపు, తెలుపు రంగు పాములు కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు అవుతారని అర్థం. అంతే కాకుండా మీ ఆరోగ్య పరంగా ఎలాంటి నష్టాలు ఉండవని సూచన. అలాగే కలలో చీపురు, గుడ్ల గూడ, బల్లి, గులాబీ, ఏనుగు, శంఖం వంటివి కనిపిస్తే సంపద కలుగుతుందని స్వప్న శాస్త్రంలో చెప్పబడింది.

సాధారణంగా కుడి చేతిలో దురద వస్తే.. మంచిది కాదని అంటారు పెద్దలు. కానీ అలా కుడి అర చేతిలో దురద వస్తే మాత్రం.. త్వరలోనే డబ్బు మీ చేతికి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే కొన్ని నమ్మకాల ప్రకారం మూడు రకాల బల్లులు ఒకే ప్రదేశంలో కనిపిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందట. అలాగే తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినా శుభప్రదంగా చెబుతారు. త్వరలోనే డబ్బు సంపాదిస్తారని అంటారు.

అంతే కాకుండా నల్ల చీమలు.. మీ ఇంట్లోకి క్యూ కట్టినా.. పక్షి మీ ఇంటి చుట్టు ప్రక్కల గూడు కట్టినా.. శుభ సూచికంగా భావిస్తారు. ఇలా పలు రకాల సంకేతాల ద్వారా ఇంట్లో డబ్బు రాబోతుందని అర్థం చేసుకోవాలని అంటారు స్వప్న శాస్త్ర నిపుణులు.





























