- Telugu News Photo Gallery Viral photos Model desperate for a boyfriend but has been struggling to find love because men are scared to date her
Viral Photos: అందమే ఆమె సమస్య.. ఒంటరిగా మిగిలిపోయింది.. ఎందుకో తెలుసా..?
Viral Photos: అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? ప్రతి మహిళ కోరుకుంటుంది. మేకప్ అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. ఇది లేకుండా మహిళలు
Updated on: Jan 18, 2022 | 9:30 PM

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు? ప్రతి మహిళ కోరుకుంటుంది. మేకప్ అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా మారింది. ఇది లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అయితే ఒక మోడల్‌కి ఆమె అందమే సమస్యగా మారింది. ఎలిజబెత్ మేరీ షెవాలియర్ అనే మోడల్ అబ్బాయిలకు దూరం కావడానికి ఇదే కారణం.

ఎలిజబెత్ మాట్లాడుతూ.. అబ్బాయిలు తన అందాన్ని చూసి భయపడుతున్నారని, డేటింగ్‌కు దూరంగా ఉంటున్నారని, మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోతున్నారని చెప్పింది.

ఎలిజబెత్ ఇప్పటి వరకు ఏ అబ్బాయిని ప్రేమించలేదని కాదు. ఆమెకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు కానీ అతనితో దాదాపు 6 నెలల క్రితం బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది.

ఎలిజబెత్ మాట్లాడుతూ.. తన అందం, డబ్బు సంపాదన చూసి లవ్ చేసేవాళ్లు తనకు వద్దని చెప్పింది.

వయస్సు, వృత్తితో సంబంధం లేకుండా తనతో సరిగ్గా మాట్లాడే నిజాయితీగల వ్యక్తి కోసం తాను వెతుకుతున్నానని తెలిపింది.



