- Telugu News Photo Gallery Viral photos Know bihar is dry state but prople drinks more liquor than maharashtra
ఈ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించారు.. కానీ తాగుబోతులలో నెంబర్ వన్.. ఎక్కడంటే..?
Viral Photos: ఐదేళ్ల క్రితం బీహార్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. 2016లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించారు. కానీ
Updated on: Nov 16, 2021 | 5:53 AM

ఐదేళ్ల క్రితం బీహార్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. 2016లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించారు. కానీ ఇప్పటికీ అత్యధిక తాగుబోతులు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు. మహారాష్ట్ర కంటే ఇక్కడ ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు.

రాష్ట్రంలో ఐదేళ్లుగా మద్యాన్ని నిషేధించినా ఇంకా మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఫలితంగా ఇటీవల కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారు.

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2020ని ఉటంకిస్తూ.. బీహార్‌లో 15.5 శాతం మంది పురుషులు మద్యం తాగుతున్నారు. మహారాష్ట్రలో ఇది 13.9 శాతంగా ఉంది.

అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 15.8 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 14 శాతం మంది మద్యం సేవిస్తున్నారని సర్వేలో తేలింది.

అదే సమయంలో మహిళల గురించి మాట్లాడినట్లయితే బీహార్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో 0.4 శాతం మహిళలు మద్యం తాగుతున్నారు.



