- Telugu News Photo Gallery Viral photos Cat Unknown Facts Do you know Cats has unique nose print and cats spend three fourth of life in sleeping Here is Full Details
Cat Unknown Facts: పిల్లి 100కు పైగా వాయిస్‌లతో మిమిక్రీ చేయగలదని తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Cat Unknown Facts: నిత్యం మనుషుల మధ్య తిరిగి పిల్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో తిరుగుతూ ఉండే పెద్ద దొంగ.. ఛాన్స్ దొరికితే చాలు ఇంట్లోని పాలను తాగేస్తుంటుంది. అయితే పిల్లి గురించి చాలామందికి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు.. తెలియని విషయాలే చాలానే ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 21, 2022 | 10:03 AM

పిల్లులు చాలా తెలివైనవి. కానీ, వాటిని చాలామంది చెడుగా భావిస్తుంటారు. మూఢనమ్మకాల్లో భాగంగా పిల్లులను చూస్తే అశుభం జరుగుతుందని, ఏవేవో భావిస్తుంటారు. అదే వేరే విషయం అనుకోండి. అయితే, పిల్లుల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

మనిషికి వెలి ముద్రలు ఎలా ఉంటాయో.. ప్రతి పిల్లికి ముక్కు ముద్రలు ఉంటాయి. అవును.. మనిషికి మనిషికి వేలి ముద్రల మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంటుందో.. పిల్లి ముక్కుపై ఉండే గీతల్లో కూడా వ్యత్యాసం ఉంటుందట. ఏ రెండు పిల్లులకు కూడా సేమ్ ప్రింట్స్ ఉండవట.

పిల్లికి నిద్ర అంటే మహా ఇష్టం. నిద్రపోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. పిల్లి తన జీవితంలో మూడు వంతులు నిద్రపోవడానికే సమయం కేటాయిస్తుంది. 24 గంటల్లో సగం కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంది.

ఆడ పిల్లి, మగ పిల్లుల్లో చాలా తేడాలుఉన్నాయి. అంటే, ఆడ పిల్లి ఏదైనా పని చేసినా, అది ఆహారం తినాలన్నా, ఎవరిపైన దూసుకెళ్లాలన్నా ముందుగా తన కుడి పాదాన్ని ముందుకు వేస్తుంది. అదే సమయంలో, మగ పిల్లి దీనికి విరుద్ధంగా ఎడమ పాదాన్ని ముందుకు వేస్తుంది.

పిల్లి తన ఆహారాన్ని వాసన చూసి ఇష్టపడుతుంది. రుచి ఏమాత్రం పట్టించుకోదు. ఆహారం మంచి వాసన వస్తే, పిల్లి ఎంత ఆహారాన్ని అయినా పూర్తి చేసేస్తుంది. లేదంటే మీరు ఎంత మంచి ఫుడ్ పెట్టినా పట్టించుకోదు.

పిల్లిలో మరో ప్రతిభ ఉంది. పిల్లి తన గొంతు నుండి 100 కంటే ఎక్కువ రకాల శబ్దాలు చేయగలదు. మియావ్ అని మాత్రమే కాదు.. చాలా రకాల శబ్ధాలను చేస్తుంది.




