Viral Tweet: ఈ రకమైన సోషల్ డిస్టెన్సింగ్ చాలా ప్రమాదాకరం.. నవ్వులు పూయిస్తోన్న ఆనంద్ మహీంద్ర ట్వీట్..
Anand Mahindra Tweet: ఆనంద్ మహీంద్ర వ్యాపార రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన అద్భుత ఆలోచనలతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు ఆనంద్...
Anand Mahindra Tweet: ఆనంద్ మహీంద్ర వ్యాపార రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన అద్భుత ఆలోచనలతో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు ఆనంద్. ఇక వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు ఆనంద్ మహీంద్ర. నిత్యం నెట్టింట ఆసక్తికర పోస్టులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ ఫన్నీ కామెంట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా సోషల్ డిస్టెన్స్ అనే మాట బాగా వినిపిస్తోంది. ఏ ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉండకూడదనే నిబంధనే ఈ సోషల్ డిస్టెన్స్ ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారట్లున్న ఓ ఫొటోను ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు ఇద్దరు యువకులు బైక్‌లపై వెళుతున్నారు. అయితే ఆ సమయంలో వారిద్దరూ ఓ నిచ్చెన రెండు చివర్లను ఇద్దరి తలకు బిగుంచుకొని బైక్‌ను నడిపించుకుంటూ వెళుతున్నారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ఇలాంటి కష్ట సమయంలోనూ ఈ ఫొటో నా ముఖంపై నవ్వులు పూయించింది. కొన్ని సోషల్ డిస్టెన్స్ విధానాలు భద్రత కలిగించడం కంటే ప్రమాదానికి గురి చేస్తాయి అంటూ రాసుకొచ్చారు.
ఆనంద్ మహీంద్ర చేసిన ఫన్నీ ట్వీట్..
Brought a smile to my face even in these trying times…Some social distancing techniques may be more hazardous than protective… pic.twitter.com/tDgNXcUBKR
— anand mahindra (@anandmahindra) April 30, 2021
Also Read: మళ్ళీ మరో సంచలనం… ! ముంబై మాజీ పీసీ పరమ్ బీర్ సింగ్ మరో లెటర్ ‘బాంబ్ ‘.. ఈ సారి ఎవరి పైనంటే ?
????????? ???????????: డ్యాన్స్ తో అదరగొట్టిన ‘జయమ్మ’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Medicine Supply: చైనా నుంచి భారత్‌కు ఎయిర్‌లైన్స్ నిలిపివేత.. ముడి ఔషధాల సరఫరా నిలిచిపోతే ఇబ్బందులే