తయారీకి కావలసినవి: రెండు టేబుల్ స్పూన్స్ సన్న సగ్గుబియ్యం, రెండు కప్పులు నీళ్లు , ఒక కప్పు బియ్యప్పిండి, పాయసం కోసం 1 కప్పు బెల్లం , రెండున్నర కప్పుల చిక్కటి పాలు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్, మూడు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను తీసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడం : ముందుగా రెండు టేబుల్‌స్పూన్ల సన్న సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని, అవి మునిగేంత వరకు నీళ్లు పోసి, అరగంట నుండి గంట పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. ఒక పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి, రెండు టేబుల్‌స్పూన్ల బెల్లం వేసి పూర్తిగా కరిగించండి. బెల్లంలో నలకలు ఉంటే వడగట్టుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, అందులో ఒక కప్పు పొడి బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇది ముద్దలా తయారవుతుంది. ఈ ముద్దను మూతపెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టండి.