AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఎమోషనల్ డ్రామా.. మనసులు హత్తుకుంటున్న చిన్నారి కథ..

ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అడియన్స్ మనసులు హత్తుకునే ఓ మూవీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమా పేరు వరం D/o భార్గవి. ఈ మూవీలోని నటీనటుల యాక్టింగ్, వచ్చే ఎమోషనల్ సీన్స్ మిమ్మల్నీ ఆకట్టుకుంటాయి. అందుకే ఈ మూవీ గురించి తెలుసుకోండి.

Rajitha Chanti
|

Updated on: Nov 01, 2026 | 2:13 PM

Share
డిజిటల్ మీడియా రంగంలో వైవిధ్యమైన, మానవీయ కోణాలున్న కథలను అందిస్తున్న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' తాజాగా మరొక హృద్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఈటీవీ విన్ కథా సుధ' సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన భావోద్వేగపూరిత ఫ్యామిలీ డ్రామా 'వరం D/o భార్గవి' నవంబర్ ) నుంచి ఓటీటీలో అధికారికంగా ప్రసారం అవుతోంది. చిన్నపిల్లల అమాయకత్వం, వారి చిన్ని ఆశలు, మానవ సంబంధాలు , సరోగసీ వెనుకున్న చేదు నిజాల చుట్టూ ఈ చిత్రం అల్లింది.

1 / 5
ఈ సినిమా కథ అంతా 'వరం' అనే ఒక చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఎంతో అమాయకురాలైన ఆ పాప, తన రోజువారీ సరదాల కోసం స్నేహితుడితో కలిసి రైల్వే బోగీల నుంచి బొగ్గును సేకరిస్తుంది. ఆ బొగ్గును కొనుగోలు చేశానని ఇంట్లో కన్నతల్లి భార్గవిని నమ్మిస్తూ ఉంటుంది. ప్రతిరోజూ వచ్చే దాదాపు పది రూపాయలతో ఐస్‌క్రీమ్స్ తింటూ హాయిగా గడిపే ఆ చిన్నారి కన్ను ఒకరోజు దుకాణంలో ఉన్న ఒక ఖరీదైన చెప్పుల జతపై పడుతుంది. ఆ చెప్పులు ఎలాగైనా కొనాలనే ఆరాటంతో ఐస్‌క్రీమ్ తినడం మానేసి ప్రతి పైసా దాచిపెడుతుంది. ఆ తర్వాత ఆ డబ్బుతో చెప్పులు కొనుక్కొని సంతోషంగా ఇంటికి వెళ్తుంది.

2 / 5
అయితే, కథలో అసలైన మలుపు అక్కడే మొదలవుతుంది. ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తి, వరం ఆ చెప్పులను దొంగిలించిందని యజమానికి చెబుతాడు. దీంతో షాపు ఓనర్ , పనిచేసే వ్యక్తి ఇద్దరూ కలిసి వరం ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ వారందరికీ ఊహించని షాకింగ్ నిజం ఎదురవుతుంది. ఆ షాపు యజమాని మరెవరో కాదు, వరం కన్న సొంత తండ్రి అని బయటపడుతుంది. అంతేకాకుండా, ఇప్పటివరకు ఎంతో ప్రేమగా సాకిన భార్గవి ఆ చిన్నారి సొంత తల్లి కాదని, కేవలం సరోగసీ మదర్ మాత్రమే అనే చేదు నిజం వెలుగులోకి వస్తుంది.

3 / 5
సొంత తండ్రి బిడ్డను వద్దనుకున్నాక, పెంచిన తల్లి ఆ పాపను ఎలా సాకింది? ఈ నిజం తెలిసిన తర్వాత ఆ చిన్నారి ప్రపంచం ఎలా మారిపోయింది? కన్నతండ్రి, పెంచిన తల్లి మధ్య చిన్నారి జీవితం ఎటు సాగిందనే విషయాలను దర్శకుడు పవన్ రాచేపల్లి ఎంతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ చిత్రంలో బేబీ జెస్సికా, దివ్య దీపిక, సతీష్ సారిపల్లి, విజయ్ భారత్, మహేంద్ర గణచారి, పవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

4 / 5
విజయశాంతి నిర్మాణ బాధ్యతలు వహించగా, సాయి మధుకర్ సంగీతం మరియు పి.ఎమ్. ఉన్నికృష్ణన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రంలోని ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను ఇష్టపడే ప్రేక్షకులకు 'వరం D/o భార్గవి' ఈటీవీ విన్‌లో ఒక బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అందరి హృదయాలను హత్తుకుంటూ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

5 / 5
Follow Us
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!

ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా

రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు

అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..

లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్

ఇండియా కూటమి మెగా మార్చ్‌.. బీజేపీ తీవ్ర విమర్శలు..

ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు.. సైక్లోన్‌ మురాసుగా బలపడిన వాయుగుండం

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై బిగ్ అప్డేట్

సింగర్ ఝాన్సీ ఎలిమినేషన్‌..8 వారాలకు ఎంత సంపాదించిందంటే?

అయ్ బాబోయ్.. ఒకే జాతికి చెందిన మరో పామునే మింగేసిన విషసర్పం!