Airports: విక్రయానికి విమానాశ్రయాలు.. అవసరమైతే మీరు కొనుక్కోవచ్చు.. ఏవేవి అమ్మానికి ఉన్నాయంటే.. చిత్రాలు
వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా ఏఏఐ అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది. వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది.
Airport Sales 2
Follow us
దేశంలోని విమానయాన రంగంలో నష్టాలను పూడ్చుకునేందుకు భారత ప్రభుత్వం విమానాశ్రయాలను విక్రయానికి పెట్టింది. క్రమంగా ఎంపిక చేసిన ఎయిర్పోర్టులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది.
భారీ ఎత్తున నిధుల సమీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల మానిటైజేషన్ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నాటికి 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అంగీకరించింది. ఇందులో ఆరు పెద్ద విమానాశ్రయాలు, ఏడు చిన్నవి ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరు పెద్ద విమనాశ్రయాల్లో అమృత్సర్, భువనేశ్వర్, ఇండోర్, రాయ్పూర్, తిరుచ్చి, వారణాసి విమానాశ్రయాలను అమ్మేసేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది.
ఏడు చిన్న విమానాశ్రయాల్లో హుబ్లి, తిరుపతి, ఔరంగాబాద్, జబల్పూర్, కంగ్రా, కుషినగర్, గయ ఉన్నాయి.
మార్చి 2024 నాటికి విమానాశ్రయాల్లో దాదాపు రూ.3,700 కోట్లు ప్రైవేటు పెట్టబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలోనే జైపూర్, గువాహటి, తిరువనంతపురం విమానాశ్రయాలను త్వరలోనే స్వాధీనం చేసుకోనున్న అదానీ గ్రూప్.. నావీ ముంబై విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఇవన్నీ ఇప్పటికే స్వతంత్ర ప్రాతిపదికన ప్రైవేటీకరణ పూర్తిచేసుకున్నాయి.
వచ్చే ఏడాది నాటికి ప్రైవేటీకరణ పూర్తయ్యేలా ఏఏఐ అతి త్వరలోనే కార్యాచరణ రూపొందించనుంది. వారణాసి-కుషినగర్-గయ బుద్ధిస్ట్ సర్క్యూట్ కావడంతో బిడ్డర్లు దీనిపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఇవన్నీ పర్యాటక ప్రదేశాలు కావడంతోపాటు వారణాసి పవిత్ర పుణ్యస్థలం కావడం మరో కారణం.