- Telugu News Photo Gallery TV9 Festival Of India, A 5 Day Magnificent Cultural Extravaganza Going On In Major Dhyanchand Stadium Delhi,
TV9 Festival Of India: దసరా సందడి.. వేడుకగా ‘TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’.. పాల్గొన్న ప్రముఖులు..
TV9 Festival Of India: దసరా పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ సందడి నెలకొంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకగా జరుగుతోంది. అక్టోబర్ 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమం దృష్ట్యా టీవీ9 భారీ ఏర్పాట్లు చేసింది.
Updated on: Oct 21, 2023 | 5:28 PM

దసరా పండుగ వేళ దేశ రాజధాని ఢిల్లీలో టీవీ9 నెట్‌వర్క్ సందడి నెలకొంది. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకగా జరుగుతోంది. అక్టోబర్ 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమం దృష్ట్యా టీవీ9 భారీ ఏర్పాట్లు చేసింది. స్టేడియాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రెండో రోజు వేడుక అత్యంత అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో అత్యధిక మంది పాల్గొని.. సందడి చేస్తున్నారు.

టీవీ9 గ్రూప్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో, TV9 గ్రూప్ హోల్ టైమ్ డైరెక్టర్ హేమంత్ శర్మ, ఉద్యోగులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

తొలిరోజు జరిగిన ఈ గ్రాండ్ ప్రోగ్రాంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తొలిరోజు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే, బీజేపీ ఎంపీ, భోజ్‌పురి కళాకారుడు మనోజ్ తివారీ, ఢిల్లీ మంత్రి అతిషి సహా పలువురు సీనియర్ నేతలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వారు ఈ కార్యక్రమాన్ని అభినందించారు.

TV9 నెట్‌వర్క్ TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. పలు రకాల ప్రత్యేక స్టోర్లను కూడా ఏర్పాటు చేసి.. ప్రజల కోసం ఎన్నో రకాల వస్తువలను అందుబాటులో ఉంచారు.

పండుగ సమయంలో రకరకాల ఆహార పదార్థాలను ఆస్వాదించడంతో పాటు రకరకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు.

దీనితో పాటు గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లేటెస్ట్ గాడ్జెట్లు, ఫ్యాషన్ దుస్తులు, ఆటోమొబైల్స్, టూ వీలర్లు, ఫర్నీచర్, అనేక ఇతర వస్తువులను కూడా గొప్ప ధరలకు కొనుగోలు చేయవచ్చు.

రుచికరమైన రుచికరమైన వంటకాలు, షాపింగ్‌తో పాటు, ఈ ఈవెంట్‌లో ప్రత్యక్ష సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. పండుగ సందర్భంగా వినోదం కోసం వివిధ కార్యక్రమాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా .. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఢిల్లీకి చెందిన ప్రజలతోపాటు.. ప్రముఖులు కూడా టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను తిలకించేందుకు భారీగా చేరుకుంటున్నారు.

ఈ కార్యక్రమానికి అక్టోబర్ 24 వరకు.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనుంది.

ప్రవేశం పూర్తిగా ఉచితం. కానీ వెళ్లలేని వారు ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చొని ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చూసేందుకు వీలుగా డిజిటల్ లింక్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.





























